వేగంగా కదులుతున్న రైల్లో రీల్స్ చేస్తున్న యువతి, ఇంతలో..
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత జనాల్లో రీల్స్ పిచ్చి పీక్స్‌కి చేరింది. ఈ రీల్స్ కోసం ప్రాణాలను కూడా లెక్కచేయడంలేదు. నెట్టింట వ్యూస్, లైక్స్ కోసం ప్రమాదకర స్థితిలో రీల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది ప్రమాదాల్లో పడిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ప్రమాదకరంగా రీల్స్ చేస్తున్న యువతికి ఊహించని షాక్ తగిలింది.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన కొందరు శభాష్ అంటుంటే కొందరు మాత్రం నొచ్చుకుంటున్నారు. పిల్లలు తప్పుచేస్తే సరిదిద్దడం, వారిని సరైన మార్గంలో నడిపించడం తల్లిదండ్రుల బాధ్యత. తప్పు చేసేవారికన్నా.. అది చూస్తూ వారించకపోవడం ఇంకా పెద్ద తప్పు అంటారు. అందుకే ఓతల్లి తన కూతురు చేసిన పనికి చిర్రెత్తుకొచ్చి.. తాము ఎక్కడ ఉన్నామని కూడా చూడకుండా కూతురిని ఎడాపెడా వాయించేసింది. అవును, ఆ తల్లీకూతుర్లు ఇద్దరూ రైల్లో ప్రయాణిస్తున్నారు. ఇంతలో కూతురు తన సీటులోనుంచి లేచి వచ్చి రైల్లో డోర్ దగ్గర నిలబడింది. రైలు వేగంగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఆ యువతి రీల్ చేయడం ప్రారంభించింది. ప్రమాదకర స్థితిలో రీల్ చేస్తుండగా ఓ యువకుడు దానిని రికార్డ్ చేస్తున్నాడు. అది గమనించిన యువతి తల్లి వారివద్దకు వచ్చి.. కూతుర్ని కాస్త లోపలికి లాగి ఆ చెంపా, ఈచెంపా వాయించేసింది. అక్కడున్న యువకుడు అదికూడా వీడియో తీసేసాడు. ఆ తల్లి మాత్రం అవేమీ పట్టించుకోకుండా కూతురికి హితబోధ చేస్తూ కొడుతూనే ఉంది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటూనే.. తల్లిని మెచ్చుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆర్డర్ పెట్టకుండానే వందలకొద్దీ పార్శిళ్లు..
అవి విష పురుగులు కాదు.. జెల్లీఫిష్‌లు..
తల్లి ప్రేమను చాటుకున్న గొరిల్లా..ఏం చేసిందో చూడండి
ఎరుపు రంగులో ఉండే ఆహారాలను.. రోజూ తినాల్సిందే.. ఎందుకంటే..?
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

