ఆర్డర్ పెట్టకుండానే వందలకొద్దీ పార్శిళ్లు..
ప్రస్తుత కాలంలో ఏది కొనాలన్నా ఆన్‌లైన్‌లోనే.. ఒక్క క్లిక్‌తో కావలసిన వస్తువులు కళ్లముందు ప్రత్యక్షమవుతున్నాయి. కూరగాయల దగ్గరనుంచి విలువైన వస్తువుల వరకూ అన్నీ ఆన్‌లైన్‌లోనే కొంటున్నారు. ఈ క్రమంలో ఆర్డర్ పెట్టిన వాటికి బదులు పార్శిల్‌లో వేరే వేరే వస్తువులు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ఆర్డర్ పెట్టకుండానే కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు వచ్చి పడితే.. అదికూడా ఇంట్లో పట్టనంతగా పార్శిల్స్ వచ్చి పడితే పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి.
కాలిఫోర్నియా శాన్‌జోస్‌కు చెందిన ‘కే’ అనే మహిళకు ఏడాది క్రితం అనుకోకుండా ఓ పార్శిల్ వచ్చింది. అదేదో పొరపాటున వచ్చినట్లు భావించి దానిని పక్కన పడేసింది. కానీ, ఆ తర్వాత రోజూ అలాంటి పార్శిళ్లు వస్తూనే ఉన్నాయి. వందల సంఖ్యలో బాక్సులు తన ఇంటి ముందు పోగుపడ్డాయి. చివరికి తన ఇంటి మెట్లు కూడా కనిపించనంతగా పార్శిల్స్‌తో నిండిపోయింది. ఈ పార్శిళ్లు ఆమెకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఆ బాక్సులు మొత్తం చైనాకు చెందిన లియాశాండేడియన్ అనే కారు సీట్ కవర్ల తయారీ కంపెనీకి చెందినవి. దాని ఉత్పత్తులు నాసిరకంగా ఉంటున్నాయని, సదరు వినియోగదారులు వాటిని తిప్పిపంపేవారు. అయితే, ఆ సంస్థ రిటర్న్ అడ్రస్ కింద శాన్‌జోస్‌లోని ‘కే’ ఇంటి చిరునామాను ఇచ్చింది. దీంతో అవి ఆమె ఇంటికి రావడం మొదలైంది. వీటితో విసిగిపోయిన ఆమె.. సదరు డెలివరీ సంస్థకు అనేకసార్లు ఫిర్యాదు చేసింది. ప్రతిసారి ఇక నుంచి రావని చెప్పేవారు.. కానీ, ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో తాను చాలా పార్శిళ్లు స్వీకరించేందుకు నిరాకరించానని.. అవి కాకుండా ఇప్పడివరకూ వచ్చినవన్నీ ఇంటి ముందున్నాయని కే ఓ మీడియా సంస్థకు వెల్లడించింది. ఒక దశలో ఆ పార్శిళ్లను డొనేట్ చేయడం లేదా పారవేయడం చేస్తే 100 డాలర్లు ఇస్తానని సదరు డెలివరీ సంస్థ ఆఫర్ చేసినట్లు వెల్లడించింది. అయితే తానెందుకు ఆ పనిచేయాలని నిరాకరించినట్లు ఆమె పేర్కొంది. ఈ విషయం మీడియాలో రావడంతో బుధవారం సదరు సంస్థ బృందం ఆమె ఇంటికి చేరుకొని.. ఆ బాక్స్‌ల మొత్తాన్ని తొలగించింది. మరోసారి పార్శిళ్లు అక్కడకు రాకుండా చూసుకొంటామని హామీ ఇచ్చింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అవి విష పురుగులు కాదు.. జెల్లీఫిష్‌లు..
తల్లి ప్రేమను చాటుకున్న గొరిల్లా..ఏం చేసిందో చూడండి
ఎరుపు రంగులో ఉండే ఆహారాలను.. రోజూ తినాల్సిందే.. ఎందుకంటే..?
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

