AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లి ప్రేమను చాటుకున్న గొరిల్లా..ఏం చేసిందో చూడండి

తల్లి ప్రేమను చాటుకున్న గొరిల్లా..ఏం చేసిందో చూడండి

Phani CH
|

Updated on: Jul 29, 2025 | 8:41 PM

Share

అమ్మ అంటే అమ్మే.. ఈ పదానికి, ఈ ప్రేమకి సాటి మరోటి లేదు అంటే అతిశయోక్తి కాదు. కానీ ఇటీవల కొందరు మనుషులు ఈ అమ్మతనానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తూ.. కన్నబిడ్డలను కసాయివాళ్లలా చంపేస్తున్నారు. మనుషులు మరిచిపోతున్న మానవత్వాన్ని కొన్ని జంతువులు గుర్తు చేస్తున్నాయి.. అందుకు ఉదాహరణే ఈ వీడియో.. ఓ మహిళ తన పని బిడ్డను తీసుకొని జూకి వెళ్లింది.

అక్కడ డెన్‌లలో ఉన్న జంతువులను తన చిన్నారికి చూపిస్తూ ఆడిస్తోంది. ఈ క్రమంలో పొరబాటున బిడ్డ చేతిలోనుంచి జారి గొరిల్లా ఉండే డెన్‌లో పడిపోయింది. దాంతో ఆ తల్లికి ప్రాణం పోయినంత పనైంది. ఎవరైనా సాయం చేస్తారేమోనని చూసింది. కానీ లోపలికి వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. కొందరు జూ సిబ్బంది చెప్పేందుకు వెళ్లారు. ఇంతలో ఊహించని సంఘటన జరిగింది. ఆ డెన్‌లో ఉన్న ఓ గొరిల్లా తన నివాసంలో పడిన చిన్నారిని రెండు చేతులతో ఎత్తుకుంది. అందరూ ఆ చిన్నారిని గొరిల్లా ఏం చేస్తుందోనని భయంభయంగా చూస్తున్నారు. ఊహించని విధంగా ఆ గొరిల్లా బిడ్డకోసం తల్లడిల్లుతున్న తల్లి దగ్గరకు వచ్చి సురక్షితంగా బిడ్డను తల్లికి అందించింది. దాంతో ఆ తల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ దృశ్యం చూసి అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. గొరిల్లా తీరుకి మురిసిపోయారు. ఆ గొరిల్లాను ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. కానీ ఈ ఘటన వాస్తవమైంది కాదు.. ఏఐ సృష్టి. అయినా ఇందులో ఒక సందేశం ఉంది. మానవులు మర్చిపోతున్న మానవత్వాన్ని గుర్తుచేస్తోంది అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎరుపు రంగులో ఉండే ఆహారాల‌ను.. రోజూ తినాల్సిందే.. ఎందుకంటే..?