కుటుంబాన్ని ఆగం చేసిన ఎగ్ ఆమ్లేట్.. ఏమైందంటే? వీడియో
విజయనగరం జిల్లా, రామభద్రపురం మండలం మిత్తివలసలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సాలూరు పట్టణానికి చెందిన పాలవలస శేఖర్ భార్యతో జరిగిన చిన్నపాటి గొడవకు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శేఖర్ కు నాలుగేళ్ల క్రితం ఆదిలక్ష్మితో వివాహమైంది. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
శేఖర్ జీవనోపాధిగా వెదురుబుట్టలు, కంచాలు తయారుచేసి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. జూలై 20 ఆదివారం సాయంత్రం వ్యాపారం ముగించుకొని ఇంటికి వచ్చిన శేఖర్ భోజనం పెట్టమని భార్య ఆదిలక్ష్మిని అడిగాడు. అలా భోజనం పెట్టే క్రమంలో ఆదిలక్ష్మి భోజనంతో పాటు ఆమ్లెట్ వేసింది. అయితే ఆ ఆమ్లెట్ కొంత మాడిపోవడంతో శేఖర్ ఆగ్రహానికి లోనై భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఈ గొడవతో ఆదిలక్ష్మి అలిగి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. భార్య తనను వదిలి వెళ్లే విషయాన్ని తట్టుకోలేకపోయిన శేఖర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అలిగి వెళ్ళిన ఆదిలక్ష్మి సోమవారం తిరిగి వస్తుందని భావించాడు. అయినా రాకపోవడంతో మంగళవారం మధ్యాహ్నం మిత్తివలస గ్రామానికి వెళ్లి పురుగుల మందు తాగి తన స్నేహితులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. వెంటనే స్పందించిన స్నేహితులు శేఖర్ ను సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శేఖర్ మృతి చెందాడు. ఘటనపై సమాచారమందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నపాటి ఆమ్లెట్ వివాదం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన ఘటన అందరినీ కలిచివేసింది.
మరిన్ని వీడియోల కోసం :
యువకుడి ప్రాణం తీసిన చెప్పు.. అది ఎలా అంటే? వీడియో
పారితోషికం పెంచేసిన జాన్వీ.. పెద్ది’కి ఎంత తీసుకుంటుందో తెలుసా?
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
