మద్యం మత్తులో.. పామును కసా కసా కొరికి ..
ఓ యువకుడు మద్యం మత్తులో పామును నోటితో కొరికి తినేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లా హర్దౌలి గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. స్థానికంగా నివసించే 35 ఏళ్ల అశోక్ మద్యం సేవించి ఇంట్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చిన పామును చూసాడు. అప్పటికే మత్తులో ఉన్న అతను ఏ మాత్రం ఆలోచించకుండా ఆ పామును పట్టుకొని నోటికి తీసుకుని కొరికి తినేశాడు.
ఈ దృశ్యం చూసిన అతని తల్లి ఒక్కసారిగా కేకలు వేసింది. వెంటనే ఇతర కుటుంబ సభ్యులు వచ్చి అశోక్‌ను అడ్డుకున్నారు. అతనికి నీళ్లు తాగించడంతో పాటు నోట్లో ఉన్న పాము ముక్కలను కక్కించారు. అనంతరం అతన్ని తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకెళ్లారు. అశోక్ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగానే ఉందని వైద్యులు తెలిపారు. తిన్న పాము విషపూరితమైంది కాకపోవడం వల్ల అతనికి ప్రాణాపాయం జరగలేదని అన్నారు. ఈ సంఘటన గ్రామంలో చర్చకు దారి తీసింది. వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం అశోక్ చికిత్స పొందుతున్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రంగు మారిన టైల్స్.. ఏంటా అని చెక్ చేయగా షాక్
వామ్మో.. అద్దె ఇంటికి రూ. 23 లక్షలు అడ్వాన్స్
కూరగాయల వ్యాపారికి రూ.29 లక్షల GST నోటీసు.. కారణమేంటంటే..?
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

