RGV Vyooham: ఆర్జీవీ వ్యూహాన్ని తిప్పికొట్టిన టీడీపీ వ్యూహం.! ఆగినట్టేనా.? వస్తుందా.?

RGV Vyooham: ఆర్జీవీ వ్యూహాన్ని తిప్పికొట్టిన టీడీపీ వ్యూహం.! ఆగినట్టేనా.? వస్తుందా.?

Anil kumar poka

|

Updated on: Dec 24, 2023 | 11:58 AM

దర్శకుడు రాంగోపాల్‌వర్మ రూపొందించిన “వ్యూహం” మూవీకి షాక్‌ ఇచ్చింది హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు. ఈ సినిమాను ఓటీటీతో పాటు ఇతర ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను విజయవాడలో గ్రాండ్‌గా ప్లాన్‌ చేసింది చిత్ర యూనిట్‌. ఇక డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

దర్శకుడు రాంగోపాల్‌వర్మ రూపొందించిన “వ్యూహం” మూవీకి షాక్‌ ఇచ్చింది హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు. ఈ సినిమాను ఓటీటీతో పాటు ఇతర ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను విజయవాడలో గ్రాండ్‌గా ప్లాన్‌ చేసింది చిత్ర యూనిట్‌.

ఇక డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రిలీజ్ కాకుండానే ఈ సినిమా చుట్టూ రచ్చ రచ్చ జరుగుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో ఎదురైన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిన వ్యూహం చిత్రాన్ని..ఈ నెల 29న విడదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది మూవీ యూనిట్‌. అయితే ఈ చిత్రానికి ఇచ్చిన సెన్సార్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది హైదరాబాద్‌ సిటీ సివిల్ కోర్టు. తాజాగా‘వ్యూహం’ సినిమా విడుదలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అంతేకాదు ఈ చిత్రాన్ని ఓటీటీ, ఆన్‌లైన్‌, ఇంటర్నెట్ వేదికల్లో ఎక్కడా విడుదల చేయొద్దని ఆదేశించింది సిటీ సివిల్ కోర్టు. ఈ చిత్రాన్ని నిర్మించిన రామదూత క్రియోషన్స్‌తో పాటు దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు కూడా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.