Arbaaz Khan – Giorgia Andriani: మళ్లీ ప్రేమలో పడ్డ బాలీవుడ్ సోగ్గాడు.! దీంతో మొత్తం మూడు..
సినీ ఇండస్ట్రీలో లవ్-బ్రేకప్, పెళ్లిళ్లు- విడాకులు చాలా కామన్ అయిపోయాయి. ఇప్పటికే చాలా మంది బ్రేకప్స్, విడాకులు అంటూ ఈ మధ్యకాలంలో హంగామా చేస్తున్నారు. కొంతమంచి చక్కగా పెళ్లిళ్లు చేసుకుంటుంటే మరికొంతమంది.. బైబై అంటూ విడాకులు తీసుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి వార్త ఒకటి బాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు, నటుడు అర్బాజ్ ఖాన్ ఇటీవలి కాలంలో తన సినిమాల కంటే అతని వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. మొదట మలైకా అరోరాతో విడాకులు, తర్వాత జార్జియా ఆండ్రియానితో రిలేషన్ షిప్ తో తన వ్యక్తిగత జీవితం గురించి చాలా సార్లు చర్చకు దారితీసింది.
సినీ ఇండస్ట్రీలో లవ్-బ్రేకప్, పెళ్లిళ్లు- విడాకులు చాలా కామన్ అయిపోయాయి. ఇప్పటికే చాలా మంది బ్రేకప్స్, విడాకులు అంటూ ఈ మధ్యకాలంలో హంగామా చేస్తున్నారు. కొంతమంచి చక్కగా పెళ్లిళ్లు చేసుకుంటుంటే మరికొంతమంది.. బైబై అంటూ విడాకులు తీసుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి వార్త ఒకటి బాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు, నటుడు అర్బాజ్ ఖాన్ ఇటీవలి కాలంలో తన సినిమాల కంటే అతని వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. మొదట మలైకా అరోరాతో విడాకులు, తర్వాత జార్జియా ఆండ్రియానితో రిలేషన్ షిప్ తో తన వ్యక్తిగత జీవితం గురించి చాలా సార్లు చర్చకు దారితీసింది. చాలా ఏళ్లుగా కలిసి ఉన్న అర్బాజ్-జార్జియా కొద్ది రోజుల క్రితం విడిపోవడం మరోసారి సంచలనం రేపింది. నాలుగేళ్ల పాటు డేటింగ్ తర్వాత సడన్‌గా విడిపోయారనే వార్త వారిద్దరి అభిమానులకు షాక్ ఇచ్చింది. అయితే వీరిద్దరి బ్రేకప్ గురించి కొన్ని రోజుల క్రితం జార్జియా వెల్లడించింది. ఏడాదిన్నర క్రితమే విడిపోయామని ఆమె చెప్పుకొచ్చింది.
అయితే ఇప్పుడు అర్బాజ్ జీవితంలోకి మరోసారి ప్రేమ చిగురించిందని వార్త బయటకు వచ్చింది. ఓ మహిళతో అర్బాజ్ డేటింగ్ చేస్తున్నాడు అని అంటున్నారు. 1998లో వివాహం చేసుకున్న అర్బాజ్-మలైకా బాలీవుడ్‌లో చాలా కాలం కలిసి జీవించారు. కానీ 2016 మార్చిలో విడిపోతున్నట్టు ప్రకటించారు. మలైకా అరోరా విడాకుల తర్వాత అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది. ఆతర్వాత అర్బాజ్ జార్జియా ఆండ్రియానితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. ఇప్పుడు అర్బాజ్ జీవితంలోకి కొత్త అమ్మాయి ప్రవేశించింది. అర్బాజ్ ఖాన్ బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌తో డేటింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరూ రిలేషన్స్ షిప్ లో సీరియస్‌గా ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.