TOP 9 ET: అటు హిస్టారికల్ రికార్డ్..! | ఇటు కోట్లలో నష్టం.. నెక్స్ట్ డార్లింగ్ పరిస్థితి..?

TOP 9 ET: అటు హిస్టారికల్ రికార్డ్..! | ఇటు కోట్లలో నష్టం.. నెక్స్ట్ డార్లింగ్ పరిస్థితి..?

Anil kumar poka

|

Updated on: Jul 19, 2023 | 9:01 AM

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని తెరకెక్కిస్తున్న సినిమా బ్రో. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. దీనికి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. పవన్ పాలిటిక్స్‌తో బిజీగా ఉన్నా.. అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు సాయి ధరమ్ తేజ్.

01. Salaar
ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్.. రిలీజ్‌కు ముందే.. రికార్డులు క్రియేట్ చేస్తోంది. అది కూడా.. తెలుగు గడ్డమీదో.. లేక ఇండియా గడ్డమీదో.. కాకుండా ఏకకంగా నార్త్ అమెరికాలో! హాలీవుడ్ ఫీల్డ్‌లో..! ఎస్ ! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. భారీ స్పాన్‌లో తెరకెక్కుతున్న సలార్ ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ .. సెప్టెంబర్ 28న రిలీజ్కు రెడీ అయిపోయింది. ఇక ఈ క్రమంలోనే అమెరికాలో దాదాపు 1979 లొకేషన్స్‌లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఆల్ టైం రిలీజ్ రికార్డ్‌గా హిస్టరీ కెక్కుతోంది. అంతేకాదు రిలీజ్‌ థియేటర్స్ కౌంట్ 1979 ప్రభాస్‌ బర్త్‌ ఇయర్ కావడం కూడా.. సెంట్రాఫ్ అట్రాక్షన్ పాయింట్ గా మారింది అంతటా..!

02. Prbahas Adipurush Loss
ఇక ఎన్నో అంచనాల మధ్య జూన్ 16న రిలీజ్ అయిన ఆదిపురుష్ మూవీ.. తెలుగు సీడెడ్ ఏరియాలో.. నష్టాలతో తన జెర్నీ ముగించిదనే టాక్ ఇప్పుడు అందర్నీ షాక్ అయేలా చేస్తోంది. ఇక అకార్డింగ్ టూ బాక్సాఫీస్ ఫిల్మ్ రిపోర్ట్ ప్రభాస్ ఆదిపురుష్ మూవీ రాయలసీమ సీడెడ్‌లో దాదాపు 17.06 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిందట. అందులో దాదాపు 10.78 కోట్లు మాత్రమే ఈ మూవీ రికవరీ చేసిందట. ఇక మిగిలిన 6.82కోట్లను మాత్రం రికవరీ కాకుండానే బాక్సాఫీస్ ముందు తన పరుగు ఆపేసిందట. దీంతో ఆ మొత్తం ఈ ఏరియా డిస్ట్రిబ్యూటర్ల పై పడిందట. అయితే ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందర్నీ షాకయ్యేలా చేస్తోంది.

03.BRO
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని తెరకెక్కిస్తున్న సినిమా బ్రో. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. దీనికి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. పవన్ పాలిటిక్స్‌తో బిజీగా ఉన్నా.. అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు సాయి ధరమ్ తేజ్. మరోవైపు పోస్టర్స్ కూడా వరసగా విడుదల చేస్తూనే ఉన్నారు చిత్రయూనిట్. ఇక ఈ మూవీ జులై 28న రిలీజ్ కానుంది.

04.SDT
తన డాన్సుల విషయంలో వస్తున్న కంప్లైంట్స్‌ను సాయి ధరమ్ తేజ్ కూడా ఒప్పుకున్నారు. బ్రో సినిమాలో తన డాన్సులు తనకే నచ్చలేదని చెప్పుకొచ్చారు. త్వరలోనే కచ్చితంగా మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తానని.. ప్రస్తుతానికి బ్రేక్ తీసుకుంటున్నానని చెప్పారు తేజ్. తన ఫిజిక్, డాన్సులపై మరింత శ్రద్ధ పెట్టడమే కాదు.. మొదట సినిమాకు మించి డాన్సులు చేస్తానని చెప్పారు ఈయన. త్వరలోనే సంపత్ నందితో సినిమా చేయబోతున్నారు ఈ సుప్రీమ్ హీరో.

05. Baby
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కాంబినేషన్‌లో సాయి రాజేష్ తెరకెక్కించిన సినిమా బేబీ. మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. 8 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగిన బేబీ.. నాలుగు రోజులు ముగిసేసరికి 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఐదో రోజు కూడా అన్నిచోట్లా హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.

06. Samajavaragamana
ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సామజవరగమనా త్వరలోనే డిజిటల్‌లోకి రానుంది. ఈ చిత్ర ఓటిటి హక్కులను కొనుగోలు చేసిన ఆహా.. సినిమా డిజిటల్ విడుదలపై ప్రటకన ఇచ్చింది. త్వరలోనే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా విడుదల చేసారు ఆహా టీం. OTTలో విడుదలైన తర్వాత సినిమాకి సాలిడ్ వ్యూస్ వస్తాయని నమ్ముతున్నారు మేకర్స్. ఈ సినిమా థియెట్రికల్‌గా 40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

07. Saindhavi
సైంధవ్‌ హార్డ్ సైడ్‌ చూశారు… ఇప్పుడు హార్ట్ చూడండి అని అంటున్నారు మేకర్స్. వెంకటేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా సైంధవ్‌. ఇది ఆయనకు తొలి ప్యాన్‌ ఇండియన్‌ మూవీ. డిసెంబర్‌ 22న విడుదల కానుంది. ఈ సినిమాలో సైంధవ్‌ హార్ట్ అంటూ బేబీ సారా పోస్టర్‌ విడుదల చేశారు మేకర్స్. గాయత్రి అనే పాత్రలో కనిపిస్తుంది సారా.

08.Selfish
దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి రెండో చిత్రం ‘సెల్ఫిష్’. సుకుమార్ నిర్మాణంలో ఈ సినిమా వస్తుంది. దాంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమా కంటెంట్ విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నారు దిల్ రాజు. ఆశిష్‌ను ప్రేక్షకులకు దగ్గర చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. దానికోసమే సెల్ఫిష్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. కొత్త దర్శకుడు కాశి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయినా కూడా వెనకాల నుంచి అన్నీ సుకుమార్, దిల్ రాజు చూసుకుంటున్నట్లు తెలుస్తుంది.

09. Nayan
తుఫానుకు ముందు ఉరిమే మేఘం ఆమె అంటూ నయనతార పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు బాద్షా షారుఖ్‌ ఖాన్‌. ఆయన హీరోగా నటించిన సినిమా జవాన్‌. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌లో పవర్‌ఫుల్‌ పోలీస్‌ రోల్‌ చేశారు నయనతార. మెషిన్‌ గన్‌ పట్టుకుని స్టైలిష్‌ లుక్‌లో ఉన్న నయన్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్. అట్లీ డైరకట్‌ చేస్తున్న జవాన్‌ సెప్టెంబర్‌ 7న విడుదల కానుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...