TOP9 ET: అదిరిపోయే లుక్‌ ఈ సినిమా కోసమేనా.? | దిమ్మతిరిగే అప్డేట్.. మొత్తానికి కదిలిన హరిహర

TOP9 ET: అదిరిపోయే లుక్‌ ఈ సినిమా కోసమేనా.? | దిమ్మతిరిగే అప్డేట్.. మొత్తానికి కదిలిన హరిహర

Anil kumar poka

|

Updated on: Feb 14, 2024 | 7:45 AM

ఓ పక్క రాజకీయాలతో బిజీగా పవన్‌! ఇంకో పక్క వేరే సినిమాల షూట్లో బిజీగా మారుతోన్న పవన్‌ పెండింగ్ సినిమాల డైరెక్టర్స్‌! కట్ చేస్తే.. ఢీలా పడిపోతున్న పవన్‌ హార్డ్ కోర్ ఫ్యాన్స్! అయితే వీళ్లలో జోష్‌ నింపే ఓ న్యూస్ బయటికి వచ్చింది. పవన్‌ భారీ బడ్జెట్‌ పాన్ ఇండియా మూవీ హరి హర వీర మల్లు నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ VFX వర్క్‌ ఇరాన్, కెనడా, బెంగళూరు, చెన్నైలతో పాటు హైద్రాబాద్‌లో కూడా జరుగుతోందని.. ఫ్యాన్స్‌ అంచనాలు అందుకునేలా కష్టపడుతున్నామని..

01.Ram charan: అదిరిపోయే లుక్‌..! ఈ సినిమా కోసమేనా?

ఇది.. కాదు కాదు.. ఇది అనేలా చెర్రీ ఏదో ఒక లుక్ ఎప్పుడూ కెరీర్‌ బెస్ట్ లుక్ అనే ట్యాగ్‌ వచ్చేలా చేసుకుంటోంది. నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంటోంది. ఇక తాజాగా చెర్రీ న్యూ లుక్‌లో.. ఉన్న ఓ ఫోటో కూడా అదే చేస్తోంది. సోషల్ మీడియాలో తెగ తిరిగుతోంది. అంతేకాదు ఓ నయా డౌట్‌ను కూడా అందర్లో పుట్టేలా చేసింది. ఇంతకీ చెర్రీ ఈ నయా లుక్‌ శంకర్ గేమ్ ఛేంజర్‌ మూవీ కోసమా.. లేక బుచ్చిబాబు సినిమా కోసమా? అనే డౌట్‌తో.. మెగా ఫ్యాన్స్‌ను డైలమాలో పడేలా చేసింది. పనిలో పనిగా గేమ్ ఛేంజర్‌ అప్డేట్ కావాలనే డిమాండ్‌ కూడా మళ్లీ బయటికి తీసుకొచ్చింది ఈ ఫోటోతో..!

02.Harihara: దిమ్మతిరిగే అప్డేట్.. మొత్తానికి కదిలిన హరిహర

ఓ పక్క రాజకీయాలతో బిజీగా పవన్‌! ఇంకో పక్క వేరే సినిమాల షూట్లో బిజీగా మారుతోన్న పవన్‌ పెండింగ్ సినిమాల డైరెక్టర్స్‌! కట్ చేస్తే.. ఢీలా పడిపోతున్న పవన్‌ హార్డ్ కోర్ ఫ్యాన్స్! అయితే వీళ్లలో జోష్‌ నింపే ఓ న్యూస్ బయటికి వచ్చింది. పవన్‌ భారీ బడ్జెట్‌ పాన్ ఇండియా మూవీ హరి హర వీర మల్లు నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ VFX వర్క్‌ ఇరాన్, కెనడా, బెంగళూరు, చెన్నైలతో పాటు హైద్రాబాద్‌లో కూడా జరుగుతోందని.. ఫ్యాన్స్‌ అంచనాలు అందుకునేలా కష్టపడుతున్నామని.. త్వరలోనే ఓ స్పెషల్ ప్రోమోను కూడా రిలీజ్ చేస్తామని.. ఈ మూవీ టీం నుంచి క్రేజీ అనౌన్స్మెంట్ వచ్చింది. పవర్ స్టార్స్ ఫ్యాన్స్‌ను అది ఖుషీ అయ్యేలా చేస్తోంది.

03. allu arjun: పాకిస్తాన్‌ వరకు పాకిన అల్లు అర్జున్ మాస్ క్రేజ్

పుష్ప సినిమాతో బాలీవుడ్‌లో మాత్రమే కాదు.. మన దాయాది దేశం పాకిస్తాన్‌లో కూడా క్రేజ్ సంపాదించుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. రీసెంట్‌గా ఓ వీడియోలో.. పాకిస్తాన్‌లో కొంత మంది తమ ఫెవరెట్ హీరో అల్లు అర్జున్ అని.. పుష్ప సినిమాలోని ‘తగ్గేదే లే’ డైలాగ్‌ చెబుతూ కనిపించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అల్లు అర్జున్‌కు పాక్‌ లో కూడా రీచ్‌ పెరగడం ఇక్కడ సెన్సేషన్ అవుతోంది.

04.Trivikram: గేరే కాదు.. రూటు కూడా మార్చిన త్రివిక్రమ్‌

మాటలతోనే మ్యాజిక్ చేస్తాడు త్రివిక్రమ్‌. ఓ కుంటుంబంలోని మనుషులను.. వాళ్ల మధ్య బంధాలను కలుపుతూనే సినిమాలు తీస్తుంటారు త్రివిక్రమ్‌. మానవ విలువలు.. బంధాలు… అంటూ.. తన సినిమాను అక్కడే చుట్టేస్తుంటారు త్రివిక్రమ్‌! అని అనే వారికి.. తివిక్రమ్‌ను విమర్శించే వారికి దిమ్మతిరిగే న్యూస్. ఈ మాంత్రికుడు గేర్ మార్చాడు. రూటు చేంజ్‌ చేశారు. పాన్ ఇండియా సినిమా కాన్సెప్ట్‌తో.. తన జోనర్ కు కాస్త పక్కకు జరిగి ఓ బిగ్ స్క్రీప్ట్‌ మీద వర్క్‌చేస్తున్నారట ఈయన. ఈ సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో చేసేందుకు ప్లాన్ కూడా చేస్తున్నారట.

05.Raviteja: మళ్లొస్తున్న కిక్కు.

సురేందర్ రెడ్డి డైరెక్షన్లో.. రవితేజ హీరోగా తెరకెక్కిన ఫిల్మ్ కిక్కు. 2009లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్టైన ఈ సినిమా మళ్లీ రిలీజ్ అవుతోంది. ఫ్యాన్స్‌ డిమాండ్‌ మేరకు.. రీ రిలీజ్ ట్రెండ్‌ పట్టుకున్న మేకర్స్.. ఈసినిమాను మార్చ్‌ 1న రిలీజ్ చేస్తున్నారు.

06. viswambhara : మహేష్ సినిమా సెట్లో.. మెగాస్టార్ విశ్వంభర

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమా షూటింగ్‌ గుంటూరు కారం సెట్లో శర వేగంగా జరుగుతోంది. చిరంజీవి, త్రిషతో పాటు కీలక పాత్రధారులందరూ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్‌ చేయాలనే టార్గెట్‌తో వర్క్‌ చేస్తున్నారు ఈ మూవీ మేకర్స్.

07.Jawan : హాలీవుడ్‌లో జవాన్ జోరు

జవాన్ సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. షారూఖ్ హీరోగా తమిళ డైరెక్టర్ అట్లీ రూపొందించిన జవాన్‌ మూవీ సూపర్ హిట్ అయ్యింది. బాలీవుడ్‌తో పాటు సౌత్ స్టేట్స్‌లోనూ మంచి వసూళ్లు సాధించింది. తాజాగా హాలీవుడ్ క్రియేటివ్‌ అలయెన్స్ ఇచ్చే ‘ది అస్త్ర అవార్డ్స్‌’కు నామినేట్ అయ్యింది ఈ మూవీ. అయితే భారత్‌ నుంచి ఒక్క జవాన్‌ మాత్రమే ఈ నామినేషన్స్‌లో ఉండడం.. ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

08.thamanna: ప్రధాని మెదీకి స్పెషల్ థాంక్స్‌ చెప్పిన తమన్నా..!

భారత రత్న పురస్కారాలపై హీరోయిన్ తమన్నా తన ట్విట్టర్ హ్యాండిల్లో రియాక్టయ్యారు.చౌదరి చరణ్‌ సింగ్, ms స్వామినాథన్, మాజా పీఎం పీవీ నరసింహ రావు వంటి ముగ్గురు దిగ్గజాలకు భారత రత్న దక్కడం స్పూర్తిదాయకం అన్నారు. వారిని భారత రత్న పురస్కారంతో గౌరవించిన.. ప్రదాని మోదీకి స్పెషల్ థాంక్స్ కూడా చెప్పారు తమన్నా..!

09.Poonam pande: పూనమ్‌ పాండే పై 100 కోట్లకు దావా.

అతి ఎప్పుడూ చిక్కుల్లో పడేలానే చేస్తుంది. కర్మ ఎప్పుడూ కిక్కురుమనకుండానే మనల్ని కూర్చోబెడుతుంది. తాజాగా పూనమ్ పాండే విషయంలోనూ ఇదే జరిగింది. సర్వైకల్ క్యాన్సర్‌తో చనిపోయినట్లు తనపై తాను ఫేక్ ప్రచారం చేసుకున్న పూనమ్‌పై తాజాగా కాన్పూర్‌లోని ఫైజాన్ అన్సారీ అనే వ్యక్తి కోర్టు మెట్లెక్కారు. తప్పుడు సమాచారంతో దేశ ప్రజల మనోభావాలను పూనం దెబ్బతీసిందని ఆమెపై ఆమె భర్త సామ్ బాంబేపై .. కన్పూర్ కోర్టులో 100 కోట్ల రూపాయలకు దావా వేశాడు ఈయన.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..