Ambajipeta Marriage Band: ఓటీటీలోకి అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్
రైటర్ పద్మభూషణ్ తో హిట్ కొట్టిన సుహాస్ అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లు రాబడుతూ మొదటి వీక్ లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. కొత్త డైరెక్టర్ దుష్యంత్ కటికనేని తెరకెక్కించిన ఈ విలేజ్ ఎమోషనల్ డ్రామాలో శివాని నగరం హీరోయిన్ గా నటించింది. ఫిదా ఫేమ్ శరణ్యా ప్రదీప్ మరో కీలక పాత్ర పోషించింది.
రైటర్ పద్మభూషణ్ తో హిట్ కొట్టిన సుహాస్ అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లు రాబడుతూ మొదటి వీక్ లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. కొత్త డైరెక్టర్ దుష్యంత్ కటికనేని తెరకెక్కించిన ఈ విలేజ్ ఎమోషనల్ డ్రామాలో శివాని నగరం హీరోయిన్ గా నటించింది. ఫిదా ఫేమ్ శరణ్యా ప్రదీప్ మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికీ థియేటర్లలో మంచి కలెక్షన్లు రాబడుతోన్న అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్ చిత్రం ఓటీటీ రిలీజ్‌గురించి అప్పుడే వార్తలు వస్తున్నాయి. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా సుహాస్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ వెర్షన్ రిలీజైన నెలరోజుల్లోపే ఈ మూవీని స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. బహుశా మార్చి 1 నుంచే అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్ ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kantara 2: దేవుడి పేరుతో వ్యాపారం ఎక్కువైంది !! కాంతార 2 అడ్డుకుంటాం !!
పెళ్లి చేసుకోబోతూ.. ఇలాంటి క్యారెక్టర్స్ ఏంటి ?? చండాలంగా..
వావ్ !! కోట్ల విలువ చేసే సోర్ట్స్ కార్ కొన్న హీరోయిన్
Captain Miller: OTTలో దిమ్మతిరిగే రెస్పాన్స్.. రికార్డులు క్రియేట్ చేస్తున్న కెప్టెన్
Poonam Pandey: కర్మ అంటే ఇదే !! చావు తెలివితో.. దారుణ పరిస్థితికి పూనమ్