TOP9 ET: పవన్ కళ్యాణ్ పై విష ప్రచారం | ఒక్క మెగా కుటుంబం నుంచే రూ.8 కోట్ల సాయం.

TOP9 ET: పవన్ కళ్యాణ్ పై విష ప్రచారం | ఒక్క మెగా కుటుంబం నుంచే రూ.8 కోట్ల సాయం.

Anil kumar poka

|

Updated on: Sep 05, 2024 | 10:43 AM

ఓ పక్క పవన్‌ వరదల పరిస్థితి పై సమీక్షలు జరుపుతూ.. అధికారులను సహాయక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా చేస్తున్న వేళ.. ఆయన పై సోషల్ మీడియాలో విష ప్రచారం జరుగుతోంది. ఓ వర్గం పవన్‌ను టార్గెట్ చేసి.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. పవన్‌ పాలనలో అలసత్యం వహిస్తున్నారంటూ.. ట్విట్టర్లో రాతలు రాస్తోంది. అంతేకాదు మీమ్స్.. స్పెషల్లీ డిజైన్‌డ్‌ పోస్టర్స్‌ను కూడా షేర్ చేస్తోంది. అయితే ఈ విష ప్రచారంపై జనసైనికులు సీరియస్‌ అవుతున్నారు.

01.pawan kalyan: పవన్ కళ్యాణ్ పై విష ప్రచారం

ఓ పక్క పవన్‌ వరదల పరిస్థితి పై సమీక్షలు జరుపుతూ.. అధికారులను సహాయక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా చేస్తున్న వేళ.. ఆయన పై సోషల్ మీడియాలో విష ప్రచారం జరుగుతోంది. ఓ వర్గం పవన్‌ను టార్గెట్ చేసి.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. పవన్‌ పాలనలో అలసత్యం వహిస్తున్నారంటూ.. ట్విట్టర్లో రాతలు రాస్తోంది. అంతేకాదు మీమ్స్.. స్పెషల్లీ డిజైన్‌డ్‌ పోస్టర్స్‌ను కూడా షేర్ చేస్తోంది. అయితే ఈ విష ప్రచారంపై జనసైనికులు సీరియస్‌ అవుతున్నారు. జనసేనాని.. శాయశక్తులా తన పనిని తాను చేసుకుంటూ పోతున్నా.. ఇలా నెగెటివ్‌గా ప్రచారం చేయడం చాలా దారుణమని వారంటున్నారు. పవన్‌ పై వస్తున్న నెగెటివ్ పోస్టులను .. పోస్టర్లను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

02.nani: బ్యాడ్‌ లక్‌.! నాని సినిమాను ముంచిన వరదలు..

వరదలతో ముంపు ప్రాంతాలే కాదు.. నాని సరిపోదా శనివారం మూవీ కూడా తీవ్ర ఇబ్బందుల్లో పడింది. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో తెరకెక్కి రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కోట్లలో కలెక్షన్స్‌ వసూలు చేస్తూ.. 100 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఇక ఈక్రమంలోనే తెలుగు టూ స్టేట్స్‌ను వరదలు ముంచెత్తడంతో.. ఈ మూవీ రెవెన్యూ కాస్త స్లో అయిందని టాక్ వినిపిస్తోంది. దీంతో నాని బ్యాడ్‌ లక్‌ అనే కామెంట్ నెట్టింట వైరల్ అవుతోంది.

03.Mega Family: ఒక్క మెగా కుటుంబం నుంచే రూ.8 కోట్ల సాయం.

సాయాల్లో.. మెగా కుంటుంబం నుంచి వచ్చే సాయమే వేరయ్యా అనే కామెంట్ వస్తోంది నెట్టింట. ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సాయం చేయడంలో ముందుండే మెగా హీరోలు.. ఇప్పుడు వరదలతో అతలాకుతలం అవుతున్న తెలుగు రాష్ట్రాలకు కూడా మరో సారి భారీ సాయమే చేశారు. మెగా చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి చెరో కోటి రూపాలను విరాళంగా ప్రకటించారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తున్న పవన్‌ తెలంగాణకు ఒక కోటి రూపాయలను ఇవ్వగా.. ఆంధ్ర ప్రదేశ్‌కు ఒక కోటి… ప్లస్ ఏపీలో 400 పంచాయితీలకు కలిపి 4 కోట్లను విరాళంగా ఇచ్చారు. అంటే ఒక్క మెగా కుంటుంబంలోని ఈ ముగ్గురు హీరోలే మొత్తంగా 8 కోట్ల రూపాయలపు వరద బాధితులకు విరాళంగా ఇచ్చారు. అదే బన్నీ ప్రకటించిన కోటి రూపాయలను కూడా కలుపుకుంటే మొత్తంగా 9 కోట్లు వీళ్లే విరాళంగా ఇచ్చారు.

04.Hareesh: ఫెయిల్యూర్ ఎఫెక్ట్ రూ.2 కోట్లు వెనక్కి ఇచ్చిన డైరెక్టర్.!

రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ మిస్టర్ బచ్చన్. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో పాటే మేకర్స్‌ను కోట్లలో నష్టాల పాలు చేసింది. దీంతో ఈ మూవీ డైరెక్టర్ హరీష్ శంకర్ తన రెమ్యునరేషన్‌ నుంచి 2 కోట్ల రూపాయలను వెనక్కి ఇచ్చినట్టు తెలుస్తోంది.

05.Raviteja: రూ.4 కోట్లు వదులుకున్న రవితేజ.!

ఇక మిస్టర్ బచ్చన్ ఫెయిల్యూర్ ఎఫెక్ట్‌తో హరీష్ శంకర్ మాత్రమే కాదు.. మాస్ రాజా రవితేజ కూడా.. తన రెమ్యునరేషన్‌ నుంచి 4 కోట్లను వదులుకున్నట్టు ఓ న్యూస్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే ప్రొడ్యూసర్ బాగోగులు ఆలోచించే రవితేజ.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం.. మిస్టర్ బచ్చన్ ప్రొడ్యూసర్‌కు అండగా నిలవడం.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

06.Revanth: విజయ్‌ దళపతికి రేవంత్‌ సర్కార్ బంపర్ ఆఫర్.

కోలీవుడ్ స్టార్ హీరో.. దళపతి విజయ్‌కు రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది.ఈ సినిమా రిలీజ్‌ డేట్ సెప్టెంబర్ 5న నైజాంలోని సెలెక్టెడ్ 15 థియేటర్స్‌లో అదనపు షోలను ప్రదర్శించేందుకు అనుమతినిచ్చింది. ఇందుకు సంబంధించిన జీవోను తాజాగా రిలీజ్ చేసింది రేవంత్‌ సర్కార్. దీంతో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్‌కు ఇదో ప్లస్ పాయింట్‌గా మారింది.

07. prabhas: ప్రభాస్ చేసిన సాయంపై వదంతులు.!

ఎలాంటి ఉపద్రవాలు ముంచెత్తినా.. ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నారని తెలిసినా.. తన సినిమాలోని క్యారెక్టర్‌కు మల్లే బాహుబలి రేంజ్‌లో రియాక్టవుతుంటారు ప్రభాస్‌. ఇక ఏపీ, తెలంగాణలోని ప్రజలు వరదల్లో చిక్కుకున్నారని తెలిసి కూడా ఇలాగే రియాక్టయ్యారు. 2 కోట్ల రూపాయలను ఇరు రాష్ట్రాలకు సాయంగా ప్రకటించారు. దాంతోపాటే ముంపు ప్రాంతాల్లో ఆహారం, నీళ్ల పంపిణీకి భారీ ఏర్పాట్లు చేశారు. అయితే ఇదంతా పక్కన పెడితే.. ప్రభాస్‌ చేసిన సాయంపై నెట్టింట కొన్ని వదంతులు వచ్చాయి. ప్రభాస్‌ 5 కోట్లు సాయం చేశాడంటూ.. 6 కోట్లు సాయం చేశాడంటూ.. వార్తలు వచ్చాయి. అయితేఈన్యూసుల్లో ఎలాంటి వాస్తవం లేదని.. ప్రభాస్ 2 కోట్లు విరాళంగా ఇచ్చాడని ప్రభాస్‌ టీం చెప్పడంతో.. అందరికీ కాస్త లేట్‌గా క్లారిటీ వచ్చింది.

08.mokshu: వరదల ఎఫెక్ట్‌.. సినిమా అనౌన్స్‌మెంట్ ఉంటుందా? ఉండదా?

వరదల ఎఫెక్ట్ .. బాలయ్య కొడుకు మోక్షజ్ఙ ఎంట్రీ పై కూడా పడింది. బాలయ్య వారసుడిగా… సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇస్తున్న మోజ్ఙక్ష… ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో లాంచ్‌ అవుతున్నారు. మోక్షు బర్త్‌ డే.. సెప్టెంబర్ 6న ఇందుకు సంబంధించిన డీటెయిల్స్ ను గ్రాండ్‌ గా అనౌన్స్ చేసేందుకు బాలయ్య టీం రెడీ అవుతోందనే టాక్ కూడా ఉంది. ఇక ఈ క్రమంలోనే తెలుగు టూ స్టేట్స్ ను వరదలు ముంచెత్తడంతో.. మోక్షు సినిమా అనౌన్స్ మెంట్ మీట్ వాయిదా పడే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

09.tollywood: వరద బాధితులకు అండగా టాలీవుడ్ స్టార్ హీరోస్.! ఎవరెవరు ఎంతెంత ఇచ్చారంటే..?

తెలుగు ప్రజలకు ఎప్పుడు ఆపదొచ్చినా.. అండగా నిలబడే టాలీవుడ్ స్టార్ హీరోస్ మరో సారి తమ మంచి మనసును చాటుకున్నారు. వరదలతో అతలాకుతలం అవుతున్న తెలుగు రాష్ట్రాలను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. విరాళాలు ప్రకటించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిగతంగా.. మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు 6కోట్ల రూపాయలను ప్రకటించగా.. మెగా స్టార్ చిరు, కింగ్ నాగార్జున, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌,ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక కోటి రూపాయలను ఇరు రాష్ట్రాలకు కలిపి విరాళంగా ప్రకటించారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్, సోనూసూద్‌ రెండు కోట్ల రూపాయాలను ఇరు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి ఇవ్వగా… కమెడియన్ అలీ 6 లక్షలు.. డైరెక్టర్ వెంకీ అట్లూరి 5 లక్షలు.. అనన్య నాగెళ్ల 2.5 లక్షలు.. విరాళంగా ఇచ్చారు. వైజయంతీ మూవీస్ అశ్వినీదత్‌ ఏపీకి 25లక్షలు.. తెలంగాణకు 20 లక్షల చొప్పున సాయం అందించారు. ఇక అంతకు ముందే త్రివిక్రమ్‌, చినబాబు, నాగ వంశీ సంయుక్తంగా 50 లక్షల రూపాయలను ఇరు రాష్ట్రాలకు కలిసి విరాళంగా ఇచ్చారు. యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ 30 లక్షలు.. విశ్వక్ సేన్ 5 లక్షల రూపాయలను వరద బాధితుల కోసం సాయంగా ఇచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Sep 05, 2024 08:32 AM