TOP9 ET: బన్నీ కార్‌ను వెంబడించిన ఫ్యాన్స్.. | గామి ట్రైలర్‌కు.. ప్రభాస్ ఫిదా.!

మామూలు టైంలో తోలండ్రా అంటే.. 30 స్పీడ్‌ 40 స్పీడ్‌ దాటరు. అదే అక్కడెక్కడో ముందున్న కార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారంటే మాత్రం చేజ్‌ చేసి మరీ చూడాలనుకుంటారు. అదే చేశారు కొందురు బన్నీ హార్డ్‌ కోర్ పోరగాళ్లు. రోడ్డుపై తమ పక్క నుంచే బన్నీ రేంజ్‌ రోవర్‌ వెళ్లడంతో.. ఆ కార్‌ను వెంబడించి మరీ.. అల్లు అర్జున్‌ను చూసేందుకు ట్రై చేశారు. ఐకాన్ స్టార్ అంటూ అరిచారు. బన్నీ కూడా.. ఇలాంటివి వద్దురా నాయనా అన్నట్టే..

TOP9 ET: బన్నీ కార్‌ను వెంబడించిన ఫ్యాన్స్.. | గామి ట్రైలర్‌కు.. ప్రభాస్ ఫిదా.!

|

Updated on: Mar 02, 2024 | 7:25 AM

01.allu arjun: అల్లు అర్జున్‌ కార్‌ను వెంబడించిన ఫ్యాన్స్

మామూలు టైంలో తోలండ్రా అంటే.. 30 స్పీడ్‌ 40 స్పీడ్‌ దాటరు. అదే అక్కడెక్కడో ముందున్న కార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారంటే మాత్రం చేజ్‌ చేసి మరీ చూడాలనుకుంటారు. అదే చేశారు కొందురు బన్నీ హార్డ్‌ కోర్ పోరగాళ్లు. రోడ్డుపై తమ పక్క నుంచే బన్నీ రేంజ్‌ రోవర్‌ వెళ్లడంతో.. ఆ కార్‌ను వెంబడించి మరీ.. అల్లు అర్జున్‌ను చూసేందుకు ట్రై చేశారు. ఐకాన్ స్టార్ అంటూ అరిచారు. బన్నీ కూడా.. ఇలాంటివి వద్దురా నాయనా అన్నట్టే.. తన కార్ విండో దింపి మరీ వారికి కనిపించారు. బైక్ పై నా కార్ వెంట పడొద్దు… అంటూ వారించారు.

02. rashmika: పుష్ప ఎఫెక్ట్: దెబ్బకు జపాన్‌లో ట్రెండ్ అవుతున్న శ్రీవల్లి

రష్మిక ఇండియాలో రష్మికే కావచ్చు.. తన ఇండియన్ హార్డ్‌ కోర్ ఫ్యాన్స్‌కు క్రష్మికే కావచ్చు కానీ.. జపాన్‌ ప్రజలకు మాత్రం ఈమె శ్రీవల్లి! ఎస్ ! రీసెంట్‌గా క్రంచీ రోల్ యానిమే అవార్డ్స్‌ కోసం జపాన్‌ క్యాప్టెల్ టోక్కోకు వెళ్లిన ఈ బ్యూటీకి.. తన జపనీస్ ఫ్యాన్స్‌ నుంచి అదిరిపోయే స్వాగతం లభించింది. శ్రీవల్లి ఫోటోలతో.. పుష్ప డైలాగులతో.. జపాన్ ఫ్యాన్స్‌ నుంచి తనకు ఘన స్వాగతం లభించింది. ఆ అమ్మడిని షాక్ అయ్యేలా.. పుష్ప క్రేజ్‌ మరీ ఈరేంజా అనుకునేలా చేసింది. ఇప్పుడా వీడియోతో నెట్టింట వైరల్ కూడా అవుతోంది.

03. ram charan: ఆకాశమే హద్దుగా.. రెచ్చిపోయిన చరణ్ ఫ్యాన్స్

సినిమా రిలీజ్‌ డే.. హీరో కటౌట్‌కు పాలాభిషేకాలు చేయడం.. డబ్బు చప్పుల్లతో థియేటర్ ఊగిపోయేలా చేయడం ఫ్యాన్స్‌కు అలవాటు. అదే ఓ సినిమా రిలీజ్ డేట్‌కు ఇంకా 9 నెలలు ఉండగానే.. రిలీజ్‌ డే రోజు జరిగే అదే.. హంగామాను రీక్రియేట్‌ చేయడం మెగా ఫ్యాన్స్‌ పరిపాటి. అయితే ఇప్పుడిదే సీన్ మరోసారి జరిగింది. గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ బయటికి రావడంతో.. కొన్ని రోజులుగా చరణ్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది.. చెర్రీ హార్డ్ కోర్ అభిమానులు.. గేమ్ ఛేంజర్‌ చరణ్‌ ఫోటోకు పాలాభిక్షేపాలు చేస్తూ.. డబ్బు చప్పుల్లతో డ్యాన్స్‌ చేస్తూ.. ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. ఆ వీడియోతో ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నారు.

04. krish: నన్ను కావాలని ఇరికించారు

ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో ఏది రన్ అవుతుంది అంటే..! ఏపీలో పాలిటిక్స్.. తెలంగాణలో డ్రగ్‌ ట్విస్ట్‌ అని అంటున్నారు అందరూ. ఎందుకంటే అలా ట్విస్టుల మీద ట్విస్టులతో నడుస్తోంది రాడిసన్ డ్రగ్ కేసు కాబట్టి. ఇక తాను డ్రగ్స్ తీసుకోలేదంటూ నిన్న మొన్నటి వరకు చెప్పిన డైరెక్టర్‌ క్రిష్.. ముందస్థు బెయిల్ కోసం కోర్టుకెక్కారు. నన్ను కావాలని ఇరికించారని అంటున్నారు. దీంతో కోర్టు డ్రగ్ కేసు వివరాలు సమర్ఫించాలని పోలీసులను ఆదేశించింది. ఇక అంతకు ముందు కోర్టుకిచ్చిన రిమాండ్‌ రిపోర్ట్‌లో క్రిష్ పారిపోయినట్టు కోట్ చేశారు పోలీసులు.

05. raviteja: కిక్కుతో ఊగిపోయిన థియేటర్లు

కిక్కుతో థియేటర్లు ఊగిపోయాయి.రవితేజ హిలయరస్‌ పర్ఫార్మెన్స్‌తో.. పొట్టచక్కలయ్యేలా నవ్విపోయాయి. ఇక రీ రిలీజ్ ట్రెండ్‌లో భాగంగా రీసెంట్ గా రిలీజ్ అయిన రవితేజ కిక్కు మూవీ… మరో సారి అందరికీ విపరీతమైన కిక్కిచ్చింది. అంతేకాదు థియేటర్లో ఈ సినిమా చూస్తున్న ఆడియెన్స్‌ ఇచ్చిన దిమ్మతిరిగే రెస్పాన్స్‌తో.. ఈవీడియోలతో నెట్టింట వైరల్ అవుతోంది.

06.prabhas: గామి ట్రైలర్‌కు.. ప్రభాస్‌ ఫిదా..

విశ్వక్‌సేన్‌ హీరోగా.. విద్యాధర్‌ కాగిత డైరెక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ గామి. విశ్వక్‌ అఘోర గెటప్‌తో.. టీజర్‌తో… అందరి ఆకట్టుకున్న ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. అది కూడా అందర్నీ ఇంప్రెస్‌ చేసి.. ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే గామీ ట్రైలర్ తనకు కూడా విపరీతంగా నచ్చిందంటూ.. ఓ వీడియోను రిలీజ్ చేశారు ప్రభాస్‌. టీజర్‌ చూడానే.. ట్రైలర్ చూడాలనే ఈగర్‌ తనలో పెరిగిందని.. అందుకు తగ్గట్టే ట్రైలర్‌ సూపర్‌గా ఉందన్నారు ప్రభాస్‌. ఇక ఈ సినిమా మార్చ్ 8న రిలీజ్ కానుంది.

07. hanuman: శివరాత్రికి వస్తున్న హనుమాన్‌..

పట్టుబట్టి మరీ.. వెనక్కి తగ్గకుండ నిలబడి.. అనుకున్న సీజన్లో.. సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన హనుమాన్ మూవీ.. సూపర్ డూపర్ హిట్టైంది. కలెక్షన్ల సునామీ సృష్టించింది. అలాంటి ఈ సినిమా తాజాగా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ మూవీ రైట్స్‌ను దక్కించుకున్న జీ5 ఓటీటీ.. ఈ మూవీని మహాశివరాత్రి సందర్భంగా.. మార్చ్‌ 8న స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతోంది.

08.ali raza: నాగార్జున సినిమా వల్ల నన్ను బ్యాన్ చేశారు

సీరియల్లో యాక్ట్ చేస్తున్నా.. చూడ్డానికి హీరోలాగే కనిపించే అలీ రెజీ.. రీసెంట్‌గా ఓ ఈవెంట్లో షాకింగ్ విషయం చెప్పాడు. నాగార్జున వైల్డ్‌ డాగ్ సినిమా వల్ల.. తను టెలివిజన్ ఇండస్ట్రీ నుంచి రెండేళ్లు బ్యాన్ కావాల్సి వచ్చిందన్నారు. ఆ సినిమా డేట్స్‌తో .. ఓ సీరియల్ డేట్స్‌ క్లాష్ అవ్వడంతో.. చివరికి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే తాను టీవీ షోల్లో కానీ.. సీరియల్స్‌లో కానీ కనిపించడం లేదన్నారు. ఇక ఈ ఇతనురీసెంట్‌గా రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చకున్న ఆపరేషన్ వ్యాలెంటైన్‌లో ఓ కీల్ రోల్ చేశారు.

09.ankitha: ఆ స్టార్ ప్రొడ్యూసర్‌తో పడుకుంటేనే.. సౌత్ సినిమాలో ఛాన్స్‌!

క్యాస్టింగ్ కౌచ్ హీరోయిన్ల పాలిట శాపంగా మారుతోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎదగాలనుకున్న వారిని తొక్కేస్తోంది. అయితే తాను కూడా ఈ మహమ్మారిని ఎదుర్కొన్నా అంటూ రీసెంట్‌గా చెప్పుకొచ్చింది అంకితా లోకండే! తనకు ఓ సౌత్‌ స్టార్ సినిమాలో ఛాన్స్‌ వచ్చిందని.. అయితే తనతో బెడ్ షేర్‌ చేసుకుంటేనే ఆ సినిమా ఆఫర్ ఫైనల్ చేస్తానని.. ఆ మూవీ ప్రొడ్యూసర్‌ చెప్పారట. దీంతో షాకైన అంకితా అక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చేసిందట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Follow us