AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హలో.. నేటివ్ స్టూడియోలో షూటింగుల సందడి.. ఎక్కడ ఏం జరుగుతుందంటే

హలో.. నేటివ్ స్టూడియోలో షూటింగుల సందడి.. ఎక్కడ ఏం జరుగుతుందంటే

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Nov 26, 2025 | 5:16 PM

Share

ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు సినిమాలు వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ వంటి టాప్ హీరోల కొత్త సినిమాల షూటింగ్స్ మైసూర్, ముంబై, రామోజీ ఫిల్మ్ సిటీ వంటి దేశవ్యాప్తంగా వివిధ లొకేషన్లలో జరుగుతున్నాయి. ఈ కథనంలో, మీ అభిమాన హీరోలు ప్రస్తుతం ఏ సినిమా కోసం, ఎక్కడ షూటింగ్ చేస్తున్నారో పూర్తి వివరాలు తెలుసుకోండి.

వారం తిరిగేసరికి కొందరు హీరోలు సేమ్‌ లొకేషన్లో ఉంటారు. మరికొందరు సరికొత్త లొకేషన్లకు షిఫ్టవుతారు. వరుస సినిమాలతో టాలీవుడ్‌ కళకళలాడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున కూడా హల్‌చల్‌ చేస్తున్నారు మన హీరోలు. ఆ డీటైల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా షూటింగ్ మైసూర్ లో జరుగుతుంది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ముంబై లో కంటిన్యూ అవుతోంది. మన శంకర ప్రసాద్ గారు సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరుగుతోంది. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా షూటింగ్ ఈనెల 26 నుంచి బూత్ బంగ్లాలో జరుగనుంది. రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ పాడేరు పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. నాని – శ్రీకాంత్ ఓదెల ది ప్యారడైజ్‌ ముచ్చింతల్ లో హలో నేటివ్‌ స్టూడియోలో జరుగుతుంది. నాగచైతన్య హీరోగా కార్తీక్ వర్మ దండు డైరెక్షన్ లో నటిస్తున్న చిత్రం షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో స్పీడందుకుంది. విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాన్ డైరక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ దండు మైలారం లో జరుగుతుంది. విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కొల్లూరు లో ఫైనల్‌లో ఉంది. సూర్య వెంకీ అట్లూరి కాంబో మూవీ ఊటి లో, వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబో మూవీ అల్యూమినియం ఫ్యాక్టరీలో లేటెస్ట్ షెడ్యూల్స్ లో ఉన్నాయి. సాయి దుర్గ తేజ్‌ సంబరాల ఏటి గట్టు సినిమా షూటింగ్ తుక్కుగూడ లో కంటిన్యూ అవుతోంది. అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా షూటింగ్ బూత్ బంగ్లాలో ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాలయ్య క్రేజ్‌ ముందు మోకరిల్లిన అవెంజర్స్‌

సినిమా హాళ్లు,అపార్ట్‌మెంట్లలోకి ఆధార్‌ ఉంటేనే ఎంట్రీ?త్వరలో కొత్త రూల్‌

పెళ్లిలో ఖరీదైన గిఫ్ట్‌ ఇస్తున్నారా ?? అయితే ఈ విషయం తప్పకుండ తెలుసుకోవాలి

కూల్‌డ్రింక్‌పై ఇష్టంతో అతనేం చేశాడో చూడండి !!

వీళ్లు మామూలోళ్లు కాదు.. పోలీసులకే మస్కా కొట్టి జంప్‌