చిరంజీవి వినతిని పట్టించుకోని GHMC.. ఊహించని షాకిచ్చిన మెగాస్టార్
జూబ్లీహిల్స్ లోని మెగాస్టార్ చిరంజీవి ఇంటిలో జరుగుతున్న పునరుద్ధరణ పనులపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తన దరఖాస్తును జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలించి చర్యలు తీసుకునేలా ఈ సందర్భంగా చిరంజీవి కోర్టును కోరగా.. ఈ అంశంపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా.. చిరంజీవి ఒక రిటైన్ వాల్ నిర్మించారు. అయితే, ఈ రిటైన్ వాల్‌ని.. రెగ్యులరైజ్ చేయాలంటూ.. ఈ ఏడాది జూన్ 5న మెగాస్టార్ చిరంజీవి.. జీహెచ్ఎంసీకి దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ, దానిపై అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో.. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 2002లోనే G+2 ఇంటి నిర్మాణానికి తాను నగర పాలక సంస్థ నుంచి అన్ని అనుమతులూ పొందానని తన లాయర్ ద్వారా కోర్టుకు విన్నవించారు చిరంజీవి.అలాగే, ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పునరుద్ధరణ నిర్మాణాలు కూడా చట్టబద్ధమైనవే అంటూ చిరు తరుపు లాయర్ కోర్టుకు తెలియజేశాడు.వీటిని పరిశీలించి అధికారికంగా క్రమబద్ధీకరించాలని చిరంజీవి కోరినప్పటికీ GHMC స్పందించలేదని కోర్టుకు విన్నవించారు. దీనిపై జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది స్పందిస్తూ… చిరంజీవి దరఖాస్తుపై త్వరలో చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు తెలిపారు. కాగా, వాదనలు విన్న ధర్మాసనం… జీహెచ్ఎంసీ చట్టబద్ధంగా నిర్ణయం తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. దీంతో చిరంజీవి ఇంటి నిర్మాణాలకు సంబంధించిన క్రమబద్ధీకరణ ప్రక్రియను GHMC వేగవంతం చేసే అవకాశం ఉంది. తదుపరి నిర్ణయం చట్ట నిబంధనలకు అనుగుణంగా తీసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహేష్ సినిమా కోసం నన్ను అందుకే వద్దనుకున్నారు..
బాబును హాలీవుడ్‌లో నిలబెట్టేందుకు జక్కన్న మాస్టర్ ప్లాన్స్
OTT హిస్టరీలోనే టెర్రిబుల్ సిరీస్.. దమ్ముంటేనే చూడండి
వర్క్ ఫ్రం హోమ్ అంటే ఆశపడ్డ మహిళ.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

