AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT హిస్టరీలోనే టెర్రిబుల్ సిరీస్.. దమ్ముంటేనే చూడండి

OTT హిస్టరీలోనే టెర్రిబుల్ సిరీస్.. దమ్ముంటేనే చూడండి

Phani CH
|

Updated on: Jul 17, 2025 | 7:10 PM

Share

ఈ మధ్యన ఓటీటీల్లో హారర్,సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలకే ఎక్కువ ఆదరణ దక్కుతోంది. అందుకే ఓటీటీ సంస్థలు ఈ కేటగిరీ సినిమాలు,వెబ్ సిరీస్ లనే ఎక్కువగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ కూడా హారర్ థ్రిల్లర్ జానర్ కు చెందినదే. షిర్లీ జాక్సన్ 1959లో రాసిన ఒక నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్..

ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లోనే అత్యంత భయంకరమైన హారర్ వెబ్ సిరీస్ గా పేరు తెచ్చుకుంది. ఆ సిరీస్ పేరు.. ది హంటింగ్ ఆఫ్ హిల్ హౌస్‌. 2018లో విడుదలైన ఈ అమెరికన్ సూపర్‌ నాచురల్ హారర్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. భయంకరమైన సీన్లు ఉండడంతో ఈ సిరీస్‌ను పిల్లలతో కలిసి చూడకపోవడమే బెటర్. ఇక పెద్ద వాళ్లకు కూడా… ఈ సిరీస్‌లోని భయంకరమైన దృశ్యాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఇక ఇందులోని ట్విస్టులు చూస్తే మైండ్ బ్లాక్ ఖాయం. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి సుమారు 50-70 నిమిషాల నిడివితో ఉంటుంది. అంతేకాదు ఈ సిరీస్ కు ఐఎమ్‌డీబీ ఏకంగా 8.5 రేటింగ్ ఇచ్చింది. హాలీవుడ్ దిగ్గజ రచయిత స్టీఫెన్ కింగ్ కూడా ఈ సిరీస్ ను చూసి ప్రశంసలు కురిపించారు. ఈ హారర్ సిరీస్ 1992 & 2018.. టైమ్‌లైన్‌లలో సాగుతూ ఒక హంటెడ్ హౌస్ చుట్టూ తిరుగుతుంది. 1992లో హ్యూ క్రెయిన్ , అతని భార్య ఒలివియా తమ ఐదుగురు పిల్లలు స్టీవెన్, షిర్లీ, థియోడోరా, లూక్, ఎలియనోర్ తో కలిసి.. ఈ హిల్ హౌస్‌కి వస్తాడు. కాగా, ఆ కుటుంబం ఆ ఇంటిలో ప్రవేశించిన తర్వాత. అనేక ఊహించని వింత ఘటనలు జరుగుతాయి. ఆ ఇంట్లో పదేపదే భయంకరమైన శబ్దాలు వినిపించటం, దెయ్యాలు కన్పించడమే గాక.. ఒలివియా వింత ప్రవర్తన కూడా ఆ ఫ్యామిలీని టెన్షన్ పెడతాయి. ఒక రోజు ఒలివియా తన పిల్లలకు విషం ఇచ్చి చంపడానికి ప్రయత్నించగా, ఆమె భర్త దానిని పసిగట్టి తన పిల్లలను అక్కడినుంచి తీసుకుపోతాడు. కానీ, ఒలివియా మాత్రం ఆ ఇంట్లోనే చనిపోతుంది. కానీ ఆ వివరాలు రహస్యంగా ఉంటాయి. మళ్లీ 2018లో ఆ ఇంటికి వెళ్లిన హీరోకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? చివరకు ఏమైంది? అనేది తెలుసుకోవలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వర్క్‌ ఫ్రం హోమ్‌ అంటే ఆశపడ్డ మహిళ.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్‌ నోట్‌

‘దగ్గరికొస్తే దూకి చస్తా’.. పోలీసులకు నేరస్తుడి వార్నింగ్‌

సెకండ్‌ హ్యాండ్‌ సైకిల్‌ పైన వీధి కుక్క పిల్లతో 15 రాష్ట్రాల యాత్ర..! సోనూ జీవితం ఎలా మారిందంటే..

ఇక రూ.5లకే రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్‌.. ఎక్కడో తెలుసా?