‘దగ్గరికొస్తే దూకి చస్తా’.. పోలీసులకు నేరస్తుడి వార్నింగ్
అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులను ఓ నేరస్తుడు ముప్పుతిప్పలు పెట్టాడు. బిల్డింగులోని ఐదో అంతస్తులో ఉన్న తన ఫ్లాట్‌కు పోలీసులు రాగానే అతడు కిచెన్ బాల్కనీలో నుంచి బయట ఎడ్జ్‌పై ప్రమాదంగా నిలుచున్నాడు. ఫ్లాట్ లోపలికి వెళ్లిన పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు. తన దగ్గరికి వస్తే పైనుంచి కిందకు దూకి చస్తానని బెదిరించాడు.
అహ్మదాబాద్‌లో ఓ నేరస్థుడు పోలీసులని ముప్పుతిప్పలు పెట్టాడు, ఓ భవనం ఐదో అంతస్తులోని తన ఫ్లాట్‌లో ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. దాంతో పోలీసులు అరెస్ట్ చేసేందుకు ఆ ఫ్లాట్‌కు వెళ్లారు. అయితే పోలీసుల రాకను పసిగట్టిన అభిషేక్ ఫ్లాట్ లోపలి నుంచి గడియపెట్టుకున్నాడు. పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వచ్చేలోగా కిచెన్ బాల్కనీలో నుంచి బయట ఉన్న ఎడ్జ్‌పైకి దిగాడు. బాల్కనీలోకి వచ్చిన పోలీసులు అతడిని పైకి రమ్మని ఎంత హెచ్చరించినా మాట వినలేదు. పైగా తన దగ్గరకు వస్తే కిందకు దూకి చస్తానని బెదిరించాడు. ఈ సందర్భంగా పోలీసులతో తనకు జరిగిన వాగ్వాదాన్ని తన మొబైల్‌లో రికార్డు చేస్తూ సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ పెట్టాడు. దాదాపు మూడు గంటలపాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. అఖరికి అదనపు బలగాలను రప్పించి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సెకండ్ హ్యాండ్ సైకిల్ పైన వీధి కుక్క పిల్లతో 15 రాష్ట్రాల యాత్ర..! సోనూ జీవితం ఎలా మారిందంటే..
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

