Tillu Square: టిల్లును మించిన టిల్లు స్క్వేర్.! వంద కోట్ల క్లబ్ వైపు పరుగులు..
టాలీవుడ్ యంగ్ హీరో, డీజే టిల్లు ఫేం సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన “టిల్లు స్క్వేర్” హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మార్చి 29న విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ బాక్సాఫీస్ బరిలో మంచి కలెక్షన్లను రాబడుతోంది.
టాలీవుడ్ యంగ్ హీరో, డీజే టిల్లు ఫేం సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన “టిల్లు స్క్వేర్” హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మార్చి 29న విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ బాక్సాఫీస్ బరిలో మంచి కలెక్షన్లను రాబడుతోంది. డిజె టిల్లు స్క్వేర్ సినిమా చూసిన ప్రేక్షకులు సినిమా చాలా బాగుంది. సిద్దు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. డిజె టిల్లు కంటే సెకండ్ పార్ట్ చాలా బాగుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలోని కామెడీ, డైలాగ్స్, యాక్షన్ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో సిద్దు తనదైనశైలిలో మార్క్ చూపించాడు. సిద్దు ప్రేక్షకులను మెప్పించడంలో విజయం సాధించారు. తన మార్క్ కామెడి, సీరియస్ నెస్, డైలాగులతో ఒ యూత్ ను టార్గేట్ చేసుకుని తన పంథా ను చూపించాడు. మొదటి రోజే మంచి కలెక్షన్‌లు రాబట్టిన ఈ మూవీ రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 45.3 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి రూ. 50 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తోంది. ఇక ఈ ఆదివారం కూడా కలెక్షన్స్ భారీగానే ఉండే అవకాశం ఉంది. తొలి రోజు సినిమా బడ్జెట్‌లో 50 శాతం రికవరీ చేసిన టిల్లు గాడు రెండో రోజుతో మొత్తం ఊడ్చేసినట్లు తెలుస్తోంది. దాదాపు సినిమా బడ్డెట్ మొత్తం రెండు రోజుల్లోనే రికవరీ చేశారన్నమాట. టిల్లు గాడి వేగం చూస్తుంటే త్వరలోనే రూ.100 కోట్లు కొల్లగొట్టేలా కనిపిస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.