Tillu Square US Collection: యూఎస్ఏ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న డీజే టిల్లు.. కలెక్షన్లు ఎంతంటే.?

టాలీవుడ్‌ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ జోడీగా నటించిన తాజా చిత్రం ‘టిల్లు స్వేర్‌’ బాక్సాఫీస్‌ వద్ద కాసుల గలగలలు మోగిస్తోంది. ఒద్దికగా.. పొందికగా కనిపించే అనుపమ.. ‘టిల్లు స్వేర్‌’ మూవీలో గ్లామర్‌ గేట్లు ఎత్తేసి ఒక్కసారిగా కెరటంలా ఎగసి పడటంతో అభిమానులంతా షాక్‌కు గురయ్యారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ హిట్‌ టాక్‌తో దూసుకుపోతున్నాడు టిల్లుగాడు.

Tillu Square US Collection: యూఎస్ఏ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న డీజే టిల్లు.. కలెక్షన్లు ఎంతంటే.?

|

Updated on: Apr 01, 2024 | 10:50 AM

టాలీవుడ్‌ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ జోడీగా నటించిన తాజా చిత్రం ‘టిల్లు స్వేర్‌’ బాక్సాఫీస్‌ వద్ద కాసుల గలగలలు మోగిస్తోంది. ఒద్దికగా.. పొందికగా కనిపించే అనుపమ.. ‘టిల్లు స్వేర్‌’ మూవీలో గ్లామర్‌ గేట్లు ఎత్తేసి ఒక్కసారిగా కెరటంలా ఎగసి పడటంతో అభిమానులంతా షాక్‌కు గురయ్యారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ హిట్‌ టాక్‌తో దూసుకుపోతున్నాడు టిల్లుగాడు. ముఖ్యంగా యూత్‌ను అమితంగా ఆకట్టుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది. యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద “టిల్లు స్క్వేర్” చాలా స్ట్రాంగ్ గా రన్ అవుతోంది. తెలుగులో మంచి కలెక్షన్లు సాధించిన ఈ మూవీ ఉత్తర అమెరికాలో అనూహ్య రీతిలో దూసుకుపోతోంది. యూఎస్ లో గురువారం, శుక్రవారం మంచి కలెక్షన్లు రాబట్టిన టిల్లు 1.2 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిందని సమాచారం. బోల్డ్ ఫన్, రొమాన్స్ తో నిండిన యూత్ ఫుల్ సినిమా ఈజీగా 2 మిలియన్ మార్కును క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది సిద్ధు జొన్నలగడ్డ నటించిన చిత్రానికి భారీ ఓపెనింగ్ అని చెప్పచ్చు. టిల్లు స్క్వేర్ వరల్డ్ వైడ్ గా 13.7 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ తో అద్భుతమైన ఓపెనింగ్స్ రాబట్టింది. ఒక్క అమెరికాలోనే 1 మిలియన్ గ్రాస్ వసూలు చేసిందంటే ఈ మూవీ స్టామినా ఏంటో తెలుస్తోంది. సిద్ధు నటన, అనుపమ అందాలు భారీ కలెక్షన్లు సాధించడానికి దోహదపడుతున్నాయి. ముఖ్యంగా అనపమ ఇతర సినిమాకు భిన్నంగా నటించడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. మొదటి రోజే భారీ కలెక్లన్స్ సాధించిన ఈ మూవీ మరో వీకెండ్స్ కు భారీ వసూలు రాబట్టే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన
అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆ అఫిడవిట్‌ తప్పనిసరి.!
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆ అఫిడవిట్‌ తప్పనిసరి.!
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోండిలా.!
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోండిలా.!
గిరిజనులకు తప్పని డోలి కష్టాలు. గర్భిణీని రెండు కిలోమీటర్లు
గిరిజనులకు తప్పని డోలి కష్టాలు. గర్భిణీని రెండు కిలోమీటర్లు
గాయాలతో ఏనుగుపిల్ల మృతి.. తల్లడిల్లిన తల్లి ఏనుగు ఏంచేసిందంటే.!
గాయాలతో ఏనుగుపిల్ల మృతి.. తల్లడిల్లిన తల్లి ఏనుగు ఏంచేసిందంటే.!