Deepika Singh: ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరోయిన్ దీపికా సింగ్.! వీడియో..

Deepika Singh: ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరోయిన్ దీపికా సింగ్.! వీడియో..

Anil kumar poka

|

Updated on: Jun 21, 2024 | 8:21 AM

దియా ఔర్ బాతీ సీరియల్ తో పాపులర్ అయిన దీపికా సింగ్... ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఈము మంగళ లక్ష్మి సీరియల్లో నటిస్తోంది. ముంబైలోని గోరేగావ్‌లోని ఫిల్మ్‌సిటీలో ఈ సీరియల్ షూటింగ్ జరుగుతోంది.ఈ క్రమంలోనే అనుకోకుండా సెట్ లో ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీపికతో ఓ అవార్డ్ ఫంక్షన్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో గాలి బలంగా రావడంతో వెనుక ఉంచిన ప్లైవుడ్ బోర్డు దీపికపై పడిపోయింది.

దియా ఔర్ బాతీ సీరియల్ తో పాపులర్ అయిన దీపికా సింగ్… ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఈము మంగళ లక్ష్మి సీరియల్లో నటిస్తోంది. ముంబైలోని గోరేగావ్‌లోని ఫిల్మ్‌సిటీలో ఈ సీరియల్ షూటింగ్ జరుగుతోంది.ఈ క్రమంలోనే అనుకోకుండా సెట్ లో ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీపికతో ఓ అవార్డ్ ఫంక్షన్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో గాలి బలంగా రావడంతో వెనుక ఉంచిన ప్లైవుడ్ బోర్డు దీపికపై పడిపోయింది. దీంతో గట్టిగా కేకలు వేస్తూ కిందపడిపోయింది దీపికా. ఆమె అరుపులు విన్న ప్రొడక్షన్ టీమ్ వెంటనే అక్కడకు చేరుకుని దీపికపై పడిన ప్లైవుడ్ బోర్డుని తీశారు.

దీపిక వెన్నుకు తీవ్ర గాయమైనట్లుగా తెలుస్తోంది. గాయపడిన స్థితిలో కూడా దీపిక షూటింగ్ కొనసాగించేందుకు ప్రయత్నించింది. నొప్పిని తగ్గించుకోవడానికి ఐస్ ప్యాక్‌లను కూడా ఉపయోగించిందని.. కానీ వెన్నులో వాపు రావడంతో షూటింగ్‌ని మధ్యలోనే వదిలేసి వెల్లిపోయినట్లు తెలుస్తోంది. వెన్నుకు తీవ్ర గాయం కావడంతో ఆమెకు కొన్నివారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. దీపికా సింగ్ ఆరోగ్యం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దియా ఔర్ బాతీ సీరియల్ ద్వారా నటిగా కెరీర్ ప్రారంభించిన దీపికా.. అదే సీరియల్ డైరెక్టర్ రోహిత్ గోయల్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక కొడుకు ఉన్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.