Sania Mirza: నా బయోపిక్‌ నేనే చేస్తా.. ఆ హీరోలు నటిస్తేనే

Sania Mirza: నా బయోపిక్‌ నేనే చేస్తా.. ఆ హీరోలు నటిస్తేనే

Phani CH

|

Updated on: Jun 10, 2024 | 5:19 PM

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మిర్జా తాజాగా netflixలో ప్రసారమవుతున్న ద గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షోకు హాజరైంది. బాక్సర్‌ మేరీ కోమ్‌, బ్యాడ్మింటన్‌ సైనా నెహ్వాల్‌, షార్ప్‌ షూటర్‌ సిఫ్త్‌ కౌర్‌తో కలిసి ఈ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా కపిల్‌ శర్మ.. సానియాను ఆసక్తికర ప్రశ్న అడిగాడు. ప్రియాంక చోప్రా మేరీ కోమ్‌ బయోపిక్‌లో నటించింది. ప్రియాంక కజిన్‌ పరిణతి చోప్రా.. సైనా నెహ్వాల్‌ బయోపిక్‌లో మెరిసింది. మరి మీ జీవిత చరిత్ర కథ సంగతేంటి? అని ఆరా తీశాడు.

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మిర్జా తాజాగా netflixలో ప్రసారమవుతున్న ద గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షోకు హాజరైంది. బాక్సర్‌ మేరీ కోమ్‌, బ్యాడ్మింటన్‌ సైనా నెహ్వాల్‌, షార్ప్‌ షూటర్‌ సిఫ్త్‌ కౌర్‌తో కలిసి ఈ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా కపిల్‌ శర్మ.. సానియాను ఆసక్తికర ప్రశ్న అడిగాడు. ప్రియాంక చోప్రా మేరీ కోమ్‌ బయోపిక్‌లో నటించింది. ప్రియాంక కజిన్‌ పరిణతి చోప్రా.. సైనా నెహ్వాల్‌ బయోపిక్‌లో మెరిసింది. మరి మీ జీవిత చరిత్ర కథ సంగతేంటి? అని ఆరా తీశాడు. అందుకు సైనా నవ్వుతూ.. మన దేశంలో చాలామంది మంచి యాక్టర్స్‌ ఉన్నారు. ఎవరు నటించినా నాకు ఓకే.. లేదంటే నా పాత్రలో నేనే నటిస్తాను అని చెప్పుకొచ్చింది. దీంతో వెంటనే కపిల్‌ శర్మ.. నువ్వు ‍ప్రేమించే వ్యక్తి పాత్రలో నటించాలనుందని గతంలో షారుక్‌ ఖాన్‌ చెప్పాడని గుర్తు చేశాడు. అందుకు సానియా.. అలాగైతే ముందు నేనెవర్నైనా ప్రేమించాలి కదా! అని బదులిచ్చింది. షారుక్‌ ఖాన్‌ లేదా అక్షయ్‌ కుమార్‌ నా బయోపిక్‌లో నటిస్తానంటే కచ్చితంగా నా పాత్రలో నేనే నటిస్తాను అని చెప్పుకొచ్చింది. కాగా సానియా మీర్జా- షోయబ్‌ మాలిక్‌ ఇటీవలే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే! సానియాకు విడాకులిచ్చిన వెంటనే షోయబ్‌ పాకిస్తాన్‌ నటి సనా జావెద్‌ను మూడో పెళ్లి చేసుకున్నాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాన నీటిలో సరదాగా పరుపుపై తేలిన ఓ వ్యక్తి.. వీడియో వైరల్

“లైగర్‌” అమ్మాయి.. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా పూజా తోమర్ రికార్డ్

ఒకే రన్‌వే పైకి రెండు విమానాలు.. తప్పిన ఘోర ప్రమాదం

సముద్రంలో పడిపోయిన ఐఫోన్ ను ఏడు గంటలు కష్టపడి వెదికి తెచ్చిన టీమ్

కంగన చెంపపై కొట్టిన కానిస్టేబుల్ కు బంగారు ఉంగరం.. ఎవరిస్తున్నారంటే ??