Sreeleela: చేతులు కాలాక ఆకులు పడితే ఎలా పాప.? శ్రీలీల కన్ఫ్యూషన్..

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో శ్రీలీల క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఒకే ఏడాది దాదాపు అరడజనుకు పైగా సినిమాలను అనౌన్స్ చేసి అందర్నీ షాక్ అయ్యేలా చేసింది.

Sreeleela: చేతులు కాలాక ఆకులు పడితే ఎలా పాప.? శ్రీలీల కన్ఫ్యూషన్..

|

Updated on: Jun 11, 2024 | 9:16 AM

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో శ్రీలీల క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఒకే ఏడాది దాదాపు అరడజనుకు పైగా సినిమాలను అనౌన్స్ చేసి అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. అంతేకాదు కంటెంట్‏తో సంబంధం లేకుండా వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెండితెరపై సందడి చేస్తూ వచ్చింది శ్రీలీల. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు ఆమెకు నైట్ మేర్ మిగిల్చాయి. అప్పటి వరకుబ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫాంలో ఉన్న శ్రీలీల ఖాతాలో ఉన్నట్టుండి కొన్ని డిజాస్టర్స్ వచ్చి చేరాయి. దీంతో ఓ బిగ్ నిర్ణయం తీసుకుందట ఈ బ్యూటీ.. సినిమాల ఎంపికపై ఈసారి కాస్త గట్టిగానే దృష్టి పెట్టిందట. కంటెంట్, పాత్ర ప్రాధాన్యత చూసి సినిమాలు ఎంచుకోవాలని నిర్ణయించుకుందట. దీంతో కొన్ని రోజులుగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకుండా సైలెంట్ అయ్యిందట ఈ బ్యూటీ. అయితే ఈ న్యూస్ బయటికి రావడంతో.. ఆమె ఫ్యాన్స్ నెట్టింట ఓ కామెంట్ చేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఎలా అంటూ.. కామెంట్లలో చెబుతూ ఆమెను ట్యాగ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us