Samantha: నేను మౌనంగా ఉన్నానంటే తప్పు అంగీకరించానని కాదు..

Samantha: నేను మౌనంగా ఉన్నానంటే తప్పు అంగీకరించానని కాదు..

Phani CH

|

Updated on: Apr 23, 2022 | 9:57 PM

ఇటీవల నాగచైతన్య నుంచి విడిపోయాక.. సమంత సోషల్ మీడియాలో ఏ కామెంట్ చేసినా విపరీతమైన ఆసక్తి కలిగిస్తోంది. తాజాగా ఆమె బౌద్ధ మత గురువు దలైలామా కొటేషన్ ను ఉదహరించి మరోసారి కలకలం రేపారు.

ఇటీవల నాగచైతన్య నుంచి విడిపోయాక.. సమంత సోషల్ మీడియాలో ఏ కామెంట్ చేసినా విపరీతమైన ఆసక్తి కలిగిస్తోంది. తాజాగా ఆమె బౌద్ధ మత గురువు దలైలామా కొటేషన్ ను ఉదహరించి మరోసారి కలకలం రేపారు. తరచూ ఆసక్తికర ఫొటోలు, సరదా వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానుల్ని అలరించే సమంత తాజాగా పెట్టిన ఈ ట్వీట్ చర్చనీయాంశమైంది. మౌనం, దయ.. తదితర అంశాలపై బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామ రాసిన కోట్‌ను చెప్పడమే ఇందుకు కారణం. ‘‘నేను మౌనంగా ఉన్నానంటే పట్టించుకోవడంలేదని, ఏమీ మాట్లాడటం లేదంటే తప్పు అంగీకరించానని కాదు. నా దయార్ధ హృదయాన్ని బలహీనత అని మీరు పొరపడొద్దు. దయ, క్షమాగుణానికి కూడా ఓ ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుంది’’ అనే మాటలతో సమంత ట్వీట్‌ చేసింది. దాంతో ఎవరిని ఉద్దేశించి ఆమె అలా ట్వీట్‌ చేసింది? అసలు ఏం జరిగింది? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ‘ఓ నెటిజన్‌ ట్రోల్‌ వల్ల ఇలా చేసింది’ అని కొందరంటే.. ‘ఆధ్యాత్మిక చింతనలో భాగంగా ఇలా పెట్టింది’ అంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

Also Read:

ఎత్తర జెండా జపాన్‌ వెర్షన్‌.. చెర్రీ, తారక్‌, అలియాలను దింపేశారంతే !!

Ram Charan: రాఖీభాయ్‌ను ఓ రేంజ్లో పొగిడేసిన చెర్రీ !!

ఓకే సినిమాలో మామా అల్లుడు !! అయితే కండీషన్‌ అప్లై అన్న అల్లుడు !!

హాస్టల్ ను బార్ చేసిన 10th క్లాస్ స్టూడెంట్స్ !! నెట్టింట ట్రేండింగ్

ఓరినీ తెలివి తెల్లార… ఐపీఎల్ కోసం ఏకంగా హాట్‌స్టార్ హ్యాక్ చేసిండు