నా తర్వాత ఆ పని చేసిన ఏకైక వ్యక్తి మెగాస్టార్.. ఆసక్తికర విషయాలు చెప్పిన సల్మాన్‌ఖాన్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో చిరు డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార మెగాస్టార్ సిస్టర్ గా నటిస్తున్నారు. అలాగే సత్య దేవ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించి అలరించనున్నారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్రం హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబై లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి తోపాటు సల్మాన్ ఖాన్ కూడా హాజరయ్యారు. సా సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సల్మాన్ మాట్లాడుతూ.. చిరంజీవి గారు ఈ సినిమా గురించి చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను. చిరంజీవి గారితో నటించడం గొప్ప అనుభవం. ఇందులో చాలా కొత్త పాత్ర చేశాను. మల్టీస్టారర్లు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే వుంటాను. మల్టీ స్టార్ చిత్రాలు చేయడం పరిశ్రమకు మంచింది. అలాగే సినిమాలని నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ప్రపంచమంతా చూస్తారు. గాడ్ ఫాదర్ నా తొలి తెలుగు సినిమా. ప్రేక్షకులని కచ్చితంగా అలరిస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు సల్మాన్ ఖాన్. అలాగే చిరంజీవితో కలిసి థాయ్‌లాండ్ లో ఓ యాడ్ షూటింగ్ పూర్తిచేసుకుని తిరిగి ముంబైకి చేరినప్ప్డు మెగాస్టార్ తన ఇంట్లోనే బస చేసారన్నారు. ఆ సమయంలో ఆయన తన సోఫా పైన పడుకున్నారని, తాను కాకుండా తన సోఫాలో పడుకున్న ఏకైక వ్యక్తి చిరు గారు అంటూ సరదాగా చెప్పారు సల్మాన్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Meena: అది నా డ్రీమ్ క్యారెక్టర్..ఆమె కొట్టేసింది.. అందుకే ఆమె అంటే..
గ్రామంలో వింత రూల్.. సైరన్ మోగిందంటే వాటిని పక్కన పడేయాల్సిందే !!
ష్.. నేనూ ఇక్కడే పడుకుంటా.. డిస్టర్బ్ చెయ్యొద్దు..
ఓర్నీ.. నీ తెలివి తెల్లారిపోనూ.. సీటు కోసం అంత నాటకమా ??
ఇకపై వాట్సాప్ మెసేజ్‌ను ఎడిట్ చేసుకోవచ్చు.. ఎలా అంటే ??