Skanda Movie: మాస్ బీట్ స్టెప్పులతో అదరగొట్టిన రామ్, శ్రీలీల.. వీడియో.

Skanda Movie: మాస్ బీట్ స్టెప్పులతో అదరగొట్టిన రామ్, శ్రీలీల.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Aug 20, 2023 | 8:08 PM

యంగ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్‍ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న స్కంద చిత్రంపై మంచి హైప్ ఉంది. యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. శ్రీలీల హీరోయిన్‍గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘గండరబాయ్’ అనే పాట రిలీజ్ అయింది. పూర్తి లిరికల్ సాంగ్‍ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

యంగ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్‍ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న స్కంద చిత్రంపై మంచి హైప్ ఉంది. యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. శ్రీలీల హీరోయిన్‍గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘గండరబాయ్’ అనే పాట రిలీజ్ అయింది. పూర్తి లిరికల్ సాంగ్‍ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. స్కంద నుంచి వచ్చిన ఈ రెండో పాటకు థమన్ పూర్తి మాస్‍బీట్‍ను అందించాడు. ఫోక్ సాంగ్‍లా మంచి ఊపుతో ఈ పాట ఉంది. ప్రముఖ పాటల రచయిత అనంత్ శ్రీరామ్ ఈ సాంగ్‍కు రిలిక్స్ రాశారు. నకాష్ అజీజ్, సౌజన్య భాగవతుల పాడారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాట మొత్తం ఫాస్ట్ బీట్‍తో డ్యాన్స్ నంబర్‌గా ఉంది. మాస్ పాటలో రామ్, శ్రీలీల హుషారైన స్టెప్పులతో అలరించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, టైటిల్ గ్లింప్స్ తో పాటు నీ చుట్టూ తిరిగిన అనే తొలి పాటకు మంచి స్పందన వచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...