Ram Charan: బెంజ్ కారులో రామ్‌చరణ్‌ షికారు.. కార్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!(Video)

Ram Charan: బెంజ్ కారులో రామ్‌చరణ్‌ షికారు.. కార్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!(Video)

Ravi Kiran

|

Updated on: Sep 14, 2021 | 9:27 AM

మన తెలుగు సినీ స్టార్స్‏ వెహికల్స్ అంటే ఎంత ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్పోర్ట్స్ బైక్స్, లగ్జరీ కార్స్ అంటే మోజు కాస్త ఎక్కువే ఉంటుంది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న లంబోర్ఘిని కారు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

స్టార్ హీరోల గ్యారేజ్‌లో రకారకాల కార్లు, బైక్స్ ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య, సాయి ధరమ్ తేజ్ వంటి స్టార్ హీరోస్ దగ్గర ఎన్నో మోడల్‌ బైక్స్, కార్లు ఉన్నాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. విషయమేంటంటే.. ఆ కారును చరణ్ దగ్గరుండి మరీ తనకు నచ్చినట్టుగా డిజైన్ చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ స్పెషల్ డిజైన్డ్ బెంజ్ కారును ఇటీవల రామ్ చరణ్‏కు అప్పగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.