కొరియన్ అమ్మాయి నోట సారంగదరియా పాట.. వింటే మీరూ ఫిదా అవ్వాల్సిందే! (Video)
తెలంగాణ జానపదం సారంగదరియా పాట యూట్యూబ్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మంగ్లీ ఆలపించిన ఈ సాంగ్ నెట్టింట్లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. చిన్న, పెద్దా తేడా లేకుండా స్టెప్పులేసేలా చేసింది. మంగ్లీ గాత్రానికి.. సాయి పల్లవి స్టెప్పులకు ప్రేక్షకులు ముగ్దులయ్యారు.
దాని కుడీ భుజం మీద కడవా.. దాని గుత్తెపు రైకలు మెరియా.. అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగదరియా అంటూ సాగే ఈ పాట విదేశీయుల్ని కూడా ఆక్టటుకుంది. ఇటీవల మన తెలుగు సినిమా పాటలపై ఇతర దేశస్తులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. పాట నచ్చితే చాలు తమ గొంతుకను కూడా పాటకు తగ్గట్టుగా కలిపి పాడేస్తున్నారు. తాజాగా సారంగదరియా పాటను ఓ కొరియన్ అమ్మాయి అద్భుతంగా ఆలపించింది.
వైరల్ వీడియోలు
Latest Videos