Akhanda 2: అఖండ2 నుంచి హీరోయిన్ అవుట్ ? రీజన్ ఇదే..
అఖండ 2లోకి కొత్త హీరోయిన్ వచ్చింది.. ఆల్రెడీ ఉన్న హీరోయిన్ వెళ్లిపోయింది. దాంతో నందమూరి అభిమానుల్లోనే కాదు బయట కామన్ ఆడియన్స్‌లో కూడా అనుమానాలు మొదలయ్యాయి. బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న అఖండ 2 షూటింగ్ RFCలో వేగంగా జరుగుతోంది. అక్కడే కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు బోయపాటి.
ఇక మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమా నుంచి ప్రగ్యా జైస్వాల్ తప్పుకుంది. ఆమె స్థానంలోకి సంయుక్త మీనన్ వచ్చింది. ఈ మధ్యే బాలయ్యతో కలిసి ఓ గోల్డ్ యాడ్ చేసింది సంయుక్త. అలాగే ఆయనతో కలిసి ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు కూడా వచ్చింది. బహుశా ఆ పరిచయంతోనే అఖండ 2 హీరోయిన్ రేసులో సంయుక్త ముందుంది. అయితే సంయుక్త రావడం వరకు ఓకే కానీ బాలయ్యతో ఇప్పటికే రెండు సినిమాలు చేసిన ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమా నుంచి తప్పుకోవడమే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పటికే అఖండతో పాటు మొన్నొచ్చిన డాకు మహారాజ్‌లోనూ ప్రగ్యా నటించింది. బాలయ్యతో ఈమెది బ్లాక్‌బస్టర్ జోడీ కూడా. ఇంత రిలేషన్ ఉన్నా ఎందుకు సినిమా నుంచి తప్పుకుంది అనేది అర్థం కాని విషయం చాలా మందికి. అసలు ఈమె తప్పుకుందా లేదంటే తప్పించారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే తనకు తానుగా అఖండ 2 నుంచి ప్రగ్య బయటికి వచ్చిందని తెలుస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిగ్ బాస్ విన్నర్‌గా రైతు బిడ్డ !! లుంగీలో వచ్చి దిమ్మతిరిగేలా చేశాడుగా..
Vishal: ఇష్టమొచ్చినట్లు మాట్లాడి సారీ చెప్పడం అలవాటైంది.. మండిపడ్డ విశాల్
Pushpa 02: అఫీషియల్ డేట్ వచ్చేసిందోచ్.. ఇక OTTలో రప్పా రప్పా రచ్చే!
Sai Durgha Tej: అభిమానుల కడుపు నింపిన తేజు.. ఏకంగా మామను మించేలా ఉన్నాడుగా

పొట్టలో రూ.26 కోట్ల విలువైన కొకైన్.. అలా ఎలా పెట్టావ్ పాప

దువ్వాడ, దివ్వెల వారి సమర్పణలో.. వాలెంటైన్స్ డ్యూయెట్..

ట్రంప్ మరో కీలక నిర్ణయం.. వైట్ హౌస్లో ఫెయిత్ హౌస్..!

భార్యపై అనుమానంతో పెట్రోల్ పోసుకుని భర్త ఆత్మ*హ*త్యాయత్నం

నమ్మండి వీరు మగాళ్లే.. వీడియో

విండో సీటు బుక్ చేసుకున్న ప్రయాణికుడు! విమానం ఎక్కాక భారీ షాక్!

దూడకు జన్మనిచ్చిన గేదె..పుట్టిన దూడను చూసి యజమాని షాక్..!వీడియో
