Jani Master: పోలీసులఅదుపులో జానీ మాస్టర్.! గోవా నుండి హైదరాబాద్ తీసుకొచ్చారు.

Jani Master: పోలీసులఅదుపులో జానీ మాస్టర్.! గోవా నుండి హైదరాబాద్ తీసుకొచ్చారు.

Anil kumar poka

|

Updated on: Sep 20, 2024 | 9:33 AM

లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫోక్సో కింద కూడా కేస్ బుక్ చేశారు. ఇక ఈ కేసులు బుక్కైంది మొదలు.. జానీ మాస్టర్ పోలీసులకు చిక్కుండా.. దొరకుండా తిరుగుతున్నారు. దీంతో ప్రత్యేక బృందాలుగా డివైడ్‌ అయిన పోలీసులు జానీ మాస్టర్ కోసం.. తీవ్రంగా సెర్చ్‌ చేశారు. పక్కా స్కెచ్ వేశారు.

లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫోక్సో కింద కూడా కేస్ బుక్ చేశారు. ఇక ఈ కేసులు బుక్కైంది మొదలు.. జానీ మాస్టర్ పోలీసులకు చిక్కుండా.. దొరకుండా తిరుగుతున్నారు. దీంతో ప్రత్యేక బృందాలుగా డివైడ్‌ అయిన పోలీసులు జానీ మాస్టర్ కోసం.. తీవ్రంగా సెర్చ్‌ చేశారు. పక్కా స్కెచ్ వేశారు. ఈక్రమంలోనే ఈస్టార్ కొరియోగ్రాఫర్ ఎట్టకేలకు గోవాలో చిక్కాడు. చివరికి అరెస్ట్ అయ్యాడు.

ఇక ప్రస్తుతం జానీ మాస్టర్ సైబరాబాద్‌ SOT పోలీసుల అదుపులో ఉన్నాడని తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు బాధితురాలని విచారించిన పోలీసులు… పలు సెక్షన్ల కింద నాన్‌-బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. మైనర్‌గా ఉన్నప్పుడే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోక్సో యాక్ట్‌ను ఎఫ్‌ఐఆర్‌లో యాడ్‌ చేశారు. ఇక జానీ మాస్టర్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు కావడంతో ఆయన్ను అరెస్టు చేశారు పోలీసులు.

మరోవైపు జానీ మాస్టర్ భార్య ఆయేషా ఇచ్చిన సమాచారంతోనే జానీమాస్టర్ అరెస్ట్‌ చేసినట్టు తెలుస్తోంది. ఆమె నార్సింగి పీఎస్‌కు వచ్చారు. తనకు ఫేక్‌ కాల్స్‌ వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో అక్కడున్న మీడియా ప్రతినిధులతోనూ వాగ్వాదం పెట్టుకున్నట్టారు. తనపై కెమెరా పెడితే కేసులు పెడతానంటూ చిర్రుబుర్రులాడారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.