AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTTలో OGకి దిమ్మతిరిగే రెస్పాన్స్ ..షేకవుతున్న నెట్‌ఫ్లిక్స్‌

OTTలో OGకి దిమ్మతిరిగే రెస్పాన్స్ ..షేకవుతున్న నెట్‌ఫ్లిక్స్‌

Phani CH
|

Updated on: Oct 28, 2025 | 7:14 PM

Share

ఇన్నాళ్లు థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోయిన ఓజీ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండ్ అవుతుంది. దాదాపు 2 గంటల 35 నిమిషాల నిడివి గల ఈ మూవీకి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. నెట్‌ఫిక్స్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి విలన్ గా చేశాడు.

డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 1940ల నాటి కథతో అద్భుతమైన విజువల్ వండర్ అందించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్, మేనరిజం చూసి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఓజాస్ పాత్రలో నటించిన పవన్ కళ్యాణ్ తన కోల్పోయిన వారసత్వాన్ని తిరిగి పొంది.. తన సహచరుల వల్ల కలిగే ప్రమాదాన్ని ఆపడానికి తిరిగి వస్తాడా.. ? ఆ తర్వాత కథ ఎటు మలుపు తిరిగింది అనేది సినిమా. ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ నుంచి షూటింగ్ వరకు.. మూవీలోని ప్రతిదీ మనసును కదిలిస్తుంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. అయితే స్ట్రీమింగ్ అయిన వెంటనే ఈ సినిమా ట్రెండింగ్ లో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతుంది. అంతేకాదు ఓజీ మూవీ IMDBలో 6.7 రేటింగ్ పొందింది. ఇన్నాళ్లు థియేటర్లలో సత్తా చాటిన ఈ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో మాస్ రచ్చ కొనసాగిస్తుంది. ఇక ఈ చిత్రానికి తమన్ అందించిన మ్యూజిక్ మరో హైలెట్ అయ్యింది. మెగా అభిమానులకు మంచి ఊపు అందించాలే మ్యూజిక్ ఇచ్చారు తమన్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Janhvi Kapoor: తల్లి శ్రీదేవి కోసం రాసిన కవితతో అందరినీ ఏడిపించిన జాన్వి

కామెడీ పేరుతో పిచ్చివాగుడు.. వివాదంలో హైపర్ ఆది

‘బలుపు, యాటిట్యూడ్‌ తనే కాదు.. నువ్వూ కూడా తగ్గించుకోవాలమ్మా

TOP 9 ET News: దిమ్మతిరిగే బిజినెస్‌..అప్పుడే లాభాల్లో చిరు సినిమా

Kantara Chapter 1 OTT: దిమ్మతిరిగే న్యూస్.. OTTలోకి కాంతార చాప్టర్ 1