Janhvi Kapoor: తల్లి శ్రీదేవి కోసం రాసిన కవితతో అందరినీ ఏడిపించిన జాన్వి
దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవిని గుర్తుచేసుకుని ఆమె కుమార్తె, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. తన తల్లిపై ప్రేమతో స్వయంగా రాసుకున్న ఒక కవితను ఓ టాక్ షోలో చదివి వినిపించి అందరినీ కదిలించింది. ఈ ఘటనతో ఆమె తన తల్లిని ఎంతగా మిస్ అవుతుందో మరోసారి స్పష్టమైంది.
నటులు ట్వింకిల్ ఖన్నా, కాజోల్ హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్న “టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్” అనే కార్యక్రమానికి జాన్వీ కపూర్, కరణ్ జోహార్‌తో కలిసి హాజరైంది. ఈ సందర్భంగా తన తల్లిని ఉద్దేశించి రాసిన కవితను ఆమె చదివింది. నేనొక చిన్నపిల్లని, కానీ అకస్మాత్తుగా ఆ హక్కును కోల్పోయాను. ఎవరి ప్రేమ కోరుకున్నానో, వారికే దూరమయ్యాను. నా సొంత గొంతును కోల్పోయి, ఇప్పుడు అమ్మ గొంతుతో మాట్లాడుతున్నాను. ఈ రూపంలోనే ఆమెను నా దగ్గర ఉంచుకుంటున్నాను అంటూ ఎమోషనల్ అయింది జాన్వి. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లో ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో మునిగి శ్రీదేవి మరణించారు. జాన్వీ తొలి చిత్రం ‘ధడక్’ విడుదలకు కొన్ని నెలల ముందే ఆమె కన్నుమూశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా అభిమానులను తీవ్ర షాక్‌కు గురిచేసింది. శ్రీదేవి మరణం తర్వాత, ఆమె భర్త బోనీ కపూర్ మొదటి భార్య పిల్లలైన అర్జున్ కపూర్, అన్షులా కపూర్.. తమ చెల్లెళ్ళు జాన్వీ, ఖుషీ కపూర్‌కు అండగా నిలుస్తూ వస్తున్నారు. ఇటీవల జాన్వీ కపూర్ నటించిన ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’ చిత్రం వంద కోట్ల క్లబ్‌లో చేరింది. వరుణ్ ధావన్, సానియా మల్హోత్రా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మిశ్రమ టాక్ వచ్చినప్పటికీ, ఇందులో జాన్వీ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కామెడీ పేరుతో పిచ్చివాగుడు.. వివాదంలో హైపర్ ఆది
‘బలుపు, యాటిట్యూడ్ తనే కాదు.. నువ్వూ కూడా తగ్గించుకోవాలమ్మా
TOP 9 ET News: దిమ్మతిరిగే బిజినెస్..అప్పుడే లాభాల్లో చిరు సినిమా
Kantara Chapter 1 OTT: దిమ్మతిరిగే న్యూస్.. OTTలోకి కాంతార చాప్టర్ 1
కింగ్ కోబ్రా తిరగబడితే ఎలా ఉంటుందో తెలుసా.. చూస్తే గుండె గల్లంతే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. యువతి రియాక్షన్ వైరల్
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
అద్భుతం.. పెన్సిల్ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్

