Rakul Preet Singh: అత్తారింట్లో వంటపని మొదలెట్టిన రకుల్.! వీడియో వైరల్.
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈనెల 22న గోవాలోని ఓ ప్రైవేట్ హోటల్ లో ఈ ప్రేమ పక్షుల వివాహం గ్రాండ్ గా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో పాటు పలువురు సినీ ప్రముఖులు రకుల్, జాకీ భగ్నానీల వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. వివాహం అనంతరం అత్తారింట్లో అడుగుపెట్టింది రకుల్.
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈనెల 22న గోవాలోని ఓ ప్రైవేట్ హోటల్ లో ఈ ప్రేమ పక్షుల వివాహం గ్రాండ్ గా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో పాటు పలువురు సినీ ప్రముఖులు రకుల్, జాకీ భగ్నానీల వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. వివాహం అనంతరం అత్తారింట్లో అడుగుపెట్టింది రకుల్. అత్తారింట్లో అడుగుపెట్టడమే కాదు.. సంప్రదాయం ప్రకారం మెట్టినింట్లో తొలిసారి హల్వా తయారు చేసి అందరికీ రుచి చూపించింది. దీనికి సంబంధించిన ఫొటోలను రకుల్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు ‘సూపర్..’ అంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. దాంతో పాటే స్టార్ హీరోయిన్ అయినా..అత్తారింట్లో వంట పని చేయాల్సిందేగా అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక సంప్రదాయం ప్రకారం ఉత్తర భారత దేశంలో మెట్టినింట అడుగు పెట్టిన కొత్త కోడలు పెళ్లైన రెండో రోజు ఏదైనా స్వీట్ తయారు చేయాల్సి ఉంటుంది. హల్వా, ఖీర్.. ఇలా ఏదైనా నోరూరించే స్వీట్ స్వయంగా తయారుచేసి మెట్టినింటి వారికీ రుచి చూపించాల్సి ఉంటుంది. దీనినే చౌకా చర్దానా అంటారు. ఈ సంప్రదాయంలో భాగంగానే రకుల్ స్వయంగా సూజీ కా హల్వా తయారు చేసి తన అత్తింటివారికి రుచి చూపించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..