Nayanthara: అన్నపూరిణి వివాదంపై నయన్ బహిరంగ లేఖ !!
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ‘అన్నపూరణి’ సినిమాపై కొద్దిరోజులుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీపై రాముడిని కించపరిచే విధంగా కొన్ని డైలాగ్స్ ఉన్నాయంటూ.. అలాగే లవ్ జిహాద్ ప్రోత్సహించేలా సినిమా ఉందంటూ దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ చిత్రం హిందూవుల మనోభావాలను దెబ్బతీసిందని.. తక్షణమే ఈ చిత్రాన్ని ఓటీటీ నుంచి తొలగించి చిత్రయూనిట్
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ‘అన్నపూరణి’ సినిమాపై కొద్దిరోజులుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీపై రాముడిని కించపరిచే విధంగా కొన్ని డైలాగ్స్ ఉన్నాయంటూ.. అలాగే లవ్ జిహాద్ ప్రోత్సహించేలా సినిమా ఉందంటూ దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ చిత్రం హిందూవుల మనోభావాలను దెబ్బతీసిందని.. తక్షణమే ఈ చిత్రాన్ని ఓటీటీ నుంచి తొలగించి చిత్రయూనిట్ పై చర్యలు తీసుకోవాలంటూ శివసేన మాజీ నేత రమేష్ సోలంకి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ అన్నపూరణి చిత్రాన్ని తొలగించింది. అయితే ఈ వివాదం కొందరు సినీ ప్రముఖులు నయనతారకు మద్దతు తెలుపుతుండగా.. అటు రాజకీయ నాయకులు ఈ చిత్రయూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అన్నపూరణి వివాదం పై స్పందించింది నయన్. స్పందిండమే కాదు.. తన ఇన్‌స్టాలో ఓ లేఖను పోస్ట్ చేసింది. ఇక ఈ లేఖలో… తాను కానీ .. తన టీమ్ కానీ ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోవడం లేదని..తన సినిమా పై నెలకొన్న వివాదం పై క్షమాపణలు తెలిపింది నయన్. తన లేఖను జై శ్రీరామ్ అంటూనే మొదలెట్టింది కూడా..!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Devara: దేవర నుంచి బిగ్ అప్డేట్.. మొదలైన యుద్ధకాండ
Taapsee Pannu: పెద్ద కథ నడిపిన తాప్సీ.. ఏకంగా ఆ హీరోతో 13ఏడేళ్లు ప్రేమాయణం
Eagle: మీరు చెప్పినట్టే పండక్కి తప్పుకున్నాం.. ఇప్పుడు మాకు కావాల్సింది చేయండి
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

