True Lover Review: హిట్టా.? ఫట్టా.? మరో బేబీ మూవీ ట్రూ లవర్.? సక్సెస్ కొట్టినట్టేనా.?
ట్రూ లవర్.. ఈ సినిమా ట్రైలర్ చూడగానే మరో బేబీ మూవీ అన్నారు. అందులోనూ మారుతీ, skn తెలుగులో రిలీజ్ చేస్తుండడంతో.. ఇదే పక్కా అనుకున్నారు. యూత్ ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ కూడా చేశారు. అయితే ఈ మూవీ రిలీజ్ అయింది. మరి ఎలా ఉంది. లవర్స్ డే ముందు యూత్‌కు కిక్కిచ్చేలాగే ఉందా? లేక పక్కకు పోయేలానే ఉందా? తెలియాలంటే వాచ్ దిస్ రివ్యూ..!
ట్రూ లవర్ కథేంటంటే..! అరుణ్ అలియాస్ మణికందన్, దివ్య అలియాస్ గౌరీ ప్రియ ఇద్దరు కాలేజీ రోజుల్లోనే ప్రేమలో పడతారు. కాలేజీ పూర్తి కాగానే దివ్యకు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వస్తుంది. అరుణ్ మాత్రం ఖాలీగా తిరుగుతూ.. కాఫీ కేఫ్ పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే తన కొలీగ్స్‌తో దివ్య క్లోజ్గా ఉండడం.. అరుణ్‌లో ఇన్‌సెక్యూరిటీని పెంచుతుంది. పొసెసివ్ నెస్‌తో ఆమె ఎరితో మాట్లాడినా కోపం వస్తుంటుంది. దీంతో అనుమానాలు.. గొడవలు.. సారీ చెప్పడాలు.. ఇలా కంటిన్యూ అవుతుంది వాళ్ల లవ్ లైఫ్. మరి చివరకు వీళ్లిద్దరు కలిశారా? విడిపోయారా? కేఫ్ పెట్టాలన్న అరుణ్ లక్ష్యం నెరవేరిందా?లేదా? అన్నదే రిమైనింగ్ స్టోరీ.
ఓపెన్‌గా చెప్పాలంటే… ట్రూ లవర్ ఓ అనుమానపు ప్రేమ కథే. అనుమానపు ప్రేమ కారణంగా ఓ జంట ఎంత మానసిక సంఘర్షణకు లోనయింది? అనేది ఈ సినిమా కథ. ఈ జనరేషన్ ప్రేమికులకు కనెక్ట్ అయ్యే సీన్స్‌తో.. చాలా నేచురల్‌గా ఈ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ ప్రభు రామ్ వ్యాస్. రొమాన్స్, ఎమోషన్..ఫన్ అన్ని రకాల సీన్స్ … తన సినిమాలో ఉండేలా జాగ్రత్త పడ్డాడు. అండ్ కేవలం ప్రేమ కథనే కాకుండా.. అరుణ్ ఫ్యామిలీ కథను కూడా చెప్పడం సినిమాకు ప్లస్ అయింది. ఇక సినిమాలో ఫస్టాఫ్ మొత్తం.. దివ్య ను అరుణ్ అనుమానించడం.. గొడపడడం .. సారీ చెప్పడంతోనే అయిపోతుంది. అందుకే కాస్త బోర్ కొట్టిన ఫీల్ కలుగుతుంది. అరుణ్ అంత గొడవ చేస్తున్నప్పటికీ దివ్య ఎందుకు ఇంకా భరిస్తుందనే విషయాన్ని డైరెక్టర్ ఇంకాస్త బలంగా చూపిస్తే బాగుండని అనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లోనూ ఇద్దరి మధ్య ఇవే గొడవలు. కానీ అరుణ్ ఫ్యామిలీ ఎంట్రీతో కాస్త ఎమోషన్ యాడ్ అవుతుంది. క్లైమాక్స్ బాగుటుంది.
ఇక యాక్టింగ్ విషయానికి వస్తే.. అరుణ్ క్యారెక్టర్లో మణికందన్ సూపర్భ్‌గా .. యాక్ట్ చేశాడు. హీరోయిన్ దివ్య ప్రియ కూడా.. తన క్యారెక్టర్‌కు 100 పర్సెంట్ ఇచ్చింది. వీరి ఇద్దరి కెమిస్ట్రీ కూడా ఆన్ స్క్రీన్ పై చాలా నాచురల్ గా ఉంది. వీరికి తోడు సీన్ రోల్డన్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు నిజంగా ప్లస్ అయింది. BGM కూడా దిమ్మతిరిగేలా ఉంది. ఇక ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే మాత్రం.. ప్రేమలో ఉన్నవారికో.. లేక బ్రేకప్‌తో బాధపడుతున్న వారికో… ఈ సినిమా నచ్చుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..