TOP9 ET: ఈగల్‌కు దిమ్మతిరిగే వసూళ్లు | సితార పేరుతో సైబర్ మోసాలు రంగంలోకి మహేష్‌.

TOP9 ET: ఈగల్‌కు దిమ్మతిరిగే వసూళ్లు | సితార పేరుతో సైబర్ మోసాలు రంగంలోకి మహేష్‌.

Anil kumar poka

|

Updated on: Feb 10, 2024 | 8:20 PM

మహేష్ కూతురిగా మాత్రమే కాకుండా.. ఇనస్టాలో తన వీడియోలతో కూడా.. స్టార్ డమ్ తెచ్చుకున్న సితారకు సైబర్ కష్టాలు మొదలయ్యాయి. ఆమె పాపులారిటీని క్యాష్ చేసుకునేలా కొంత మంది సైబర్ నేరగాళ్లు సితార పేరుతో ఫేక్ అంకౌంట్లు క్రియేట్‌ చేసి.. ఫ్రాడ్ లింకులు పంపుతున్నారట. ఆ లింకులు క్లిక్ చేసిన వారి నుంచి నుంచి డబ్బులు దండుకుంటున్నారట. అయితే ఈ విషయం తెలిసిన మహేష్ టీం అలెర్ట్‌ అయింది. సైబర్ నేరగాళ్లపై యాక్షన్‌కు దిగడానికి రెడీ అవుతోంది.

01.ఈగల్‌కు దిమ్మతిరిగే వసూళ్లు.

ఈగల్‌తో థియేటర్లలో మ్యాజిక్ చేస్తున్నారు మాస్ రాజా రవితేజ. తన మాస్‌ యాక్షన్తో.. లుక్ అండ్ డైలాగ్ డెలివరీతో ఒక్కొక్కిలో అడ్రినలిన్ రష్ను క్రియేట్ చేస్తున్నారు. దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటున్నాడు. దాంతో పాటే దిమ్మతిరిగే ఓపెన్సింగ్ కూడా కమాయించాడని .. ఇండస్ట్రీలో టాక్.

02. సితార పేరుతో సైబర్ మోసాలు.. రంగంలోకి మహేష్‌

మహేష్ కూతురిగా మాత్రమే కాకుండా.. ఇనస్టాలో తన వీడియోలతో కూడా.. స్టార్ డమ్ తెచ్చుకున్న సితారకు సైబర్ కష్టాలు మొదలయ్యాయి. ఆమె పాపులారిటీని క్యాష్ చేసుకునేలా కొంత మంది సైబర్ నేరగాళ్లు సితార పేరుతో ఫేక్ అంకౌంట్లు క్రియేట్‌ చేసి.. ఫ్రాడ్ లింకులు పంపుతున్నారట. ఆ లింకులు క్లిక్ చేసిన వారి నుంచి నుంచి డబ్బులు దండుకుంటున్నారట. అయితే ఈ విషయం తెలిసిన మహేష్ టీం అలెర్ట్‌ అయింది. సైబర్ నేరగాళ్లపై యాక్షన్‌కు దిగడానికి రెడీ అవుతోంది.

03. Mrunal: సెక్సీగా లేవంటూ వాడు మొఖం మీదే చెప్పాడు

బాడీ షేమింగ్ కూడా విపరీతంగా బాధపెడుతుంది అందర్నీ. అదే స్టార్ హీరోయిన్ మృణాల్ విషయంలోనూ జరిగింది. తన కెరీర్‌ బిగినింగ్‌లో.. తన బాడీపై లుక్‌పై చాలా దారుణ కామెంట్స్ చేశారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో మృణాల్ చెబుతూ బాధపడింది. ఓ ఈవెంట్లో ఫోటోగ్రాఫర్ మొఖం మీదే సెక్సీగా లేవన్నాడని.. ఈ ఊరి పిల్ల ఎవరంటూ మరింకొందరు కామెంట్స్ చేశారని చెప్పింది. అయితే అవన్నీ దాటుకుని.. ఇక్కడి వరకు వచ్చా అంటూ.. కాస్త కాన్ఫిడెంట్‌గా చెప్పింది.

04. బెల్లీ డ్యాన్స్‌తో మతిపోగొడుతున్న బేబమ్మ

బేబమ్మగా తన ఇన్నోసెంట్ లుక్స్‌తో.. అందరి మైండ్‌లోకి దూరేసిన కృతి షెట్టి.. తాజాగా తన బెల్లీ డ్యాన్స్‌తో అదే అందరి మైండ్‌లో తిష్ట వేసేశారు. సినిమాల విషయంలో ఎట్ ప్రజెంట్ కాస్త స్లో డౌన్ అయిన ఈ బ్యూటీ.. రీసెంట్‌గా బెల్లీ డ్యాన్స్‌ వేస్తూ.. ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేశారు. ఇప్పుడా వీడియోతో.. తన బెల్లీ డ్యాన్స్‌తో.. ఫిబ్రవరి మాసంలో.. చెమటలు పట్టేలా చేస్తున్నారు.

05. Devara: దేవర ఒకడు కాదు.. ఇద్దరూ..! మొత్తంగా ఊహించని చెడుగుడు

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల తెరకెక్కిస్తున్న సినిమా దేవర. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారంటూ ఇన్నాళ్ళూ ఓ న్యూస్ వైరల్ అవుతూ వచ్చింది. అయితే ఆ న్యూసే ఇప్పుడు నిజమైంది. ఇందులో తారక్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని తెలిసేట్టు ఓ న్యూస్ ఈ మూవీ నుంచి బయటికి వచ్చింది. ఇక ఆ న్యూస్ ప్రకారం ఇందులో తారక్‌కు జోడీగా తాను నటిస్తున్నట్లు మరాఠీ హీరోయిన్ శృతి మరాఠే పోస్ట్ పెట్టింది. దీంతో ఈ విషయంలో అందరికీ ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

06.Gunturu Karam: అమ్మో.. 25 మిలియన్లే..! కుర్చీ మడతబెడుతూనే ఉందిగా..

కుర్చీ మడతెట్టి సాంగ్.. స్టిల్ అందర్నీ మడెట్టేస్తూనే ఉంది. రిలీజ్ డే నుంచి అందరికీ కిక్కిస్తూనే ఉన్న ఈ సాంగ్ తాజాగా యూట్యూబ్‌లో 25 మిలియన్ వ్యూస్‌ను రాబట్టేసింది. ఇంకా ఈ వ్యూ కౌంట్‌ కంటిన్యూ కూడా అవుతోంది. ఇదే ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్‌ సర్కిల్లో హాట్ టాపిక్ కూడా అవుతోంది.

07.NBK 110: ఇదెక్కి కాంబినేషన్ మామా…!

ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న నందమూరి బాలకృష్ణ, నెక్ట్స్ మూవీని ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. కమర్షియల్ మూవీ స్పెషలిస్ట్‌ హరీష్ శంకర్ డైరెక్షన్లో బాలయ్య నెక్ట్స్ మూవీ చేయబోతున్నారన్నది ఫిలిం నగర్ అప్‌డేట్‌. ప్రస్తుతం రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్‌ సినిమా తెరకెక్కిస్తున్నారు హరీష్.

08.12th Fail: 12th Fail మరో రికార్డ్‌

రీసెంట్ బాలీవుడ్ బ్లాక్ బస్టర్‌ 12th ఫెయిల్‌ మరో అరుదైన ఘనత సాధించింది. IMDB అనౌన్స్ చేసిన 250 ఉత్తమ చిత్రాల లిస్ట్‌లో స్థానం సంపాందించింది ఈ సినిమా. అది కూడా టాప్‌ 50లో స్థానం దక్కటం ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశారు డైరెక్టర్ విధు వినోద్ చోప్రా. రియల్‌ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో విక్రాంత్‌ మెస్సీ హీరోగా నటించారు.

09. Siddu Jonnalagadda: డిల్లు గాడి బర్త్‌డేకి.. తరలొచ్చిన తారలు

డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ బర్త్ డే పార్టీ గ్రాండ్‌గా జరిగింది. దీనికి ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీస్ అండ్ స్టార్స్ చాలా మంది వచ్చారు. అయితే రెండు రోజుల కింద జరిగిన ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..