Krishnam Raju Birth Anniversary: చిన్నాన్న కోసం పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్.! మొగల్తూరులోనే..

Krishnam Raju Birth Anniversary: చిన్నాన్న కోసం పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్.! మొగల్తూరులోనే..

Anil kumar poka

|

Updated on: Jan 21, 2024 | 1:40 PM

టాలీవుడ్ రెబల్ స్టార్, కేంద్ర మాజీ మాంత్రి, స్వర్గీయ కృష్ణంరాజు జయంతి జనవరి 20న. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు కృష్ణంరాజును మరోసారి గుర్తు చేసుకున్నారు. సినిమా రంగానికి రెబల్‌ స్టార్‌ అందించిన సేవలను స్మరించుకున్నారు. అలాగే కృష్ణంరాజు జయంతిని పురస్కరించుకుని పలు సామాజిక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇక ఈ క్రమంలోనే కృష్ణంరాజు సొంతూరైన మొగల్తూరులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఆయన కుటుంబీకులు.

టాలీవుడ్ రెబల్ స్టార్, కేంద్ర మాజీ మాంత్రి, స్వర్గీయ కృష్ణంరాజు జయంతి జనవరి 20న. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు కృష్ణంరాజును మరోసారి గుర్తు చేసుకున్నారు. సినిమా రంగానికి రెబల్‌ స్టార్‌ అందించిన సేవలను స్మరించుకున్నారు. అలాగే కృష్ణంరాజు జయంతిని పురస్కరించుకుని పలు సామాజిక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇక ఈ క్రమంలోనే కృష్ణంరాజు సొంతూరైన మొగల్తూరులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఆయన కుటుంబీకులు. హీరో ప్రభాస్‌, కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, కూతురు ప్రసీద ఆధ్వరంలో స్థానికంగా ఉండే శ్రీ అందే బాపన్న కళాశాలలో ఈ ఫ్రీ మెడికల్‌ క్యాంప్‌ నిర్వహించారు.

జుబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి నుంచి డాక్టర్ శేషబత్తారు, భీమవరంలోని వర్మ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ నుంచి డాక్టర్‌ వర్మతో సహా దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖ వైద్యులు ఈ వైద్య శిబిరానికి హాజరయ్యారు. ఇక అంతకు ముందు రోజే మొగల్తూరుతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లోని ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరం సేవలను వినియో గించుకోవాలని కృష్ణంరాజు సతీమణి సూచించారు. ‘కృష్ణంరాజుకు ఎంతో ఇష్టమైన మొగల్తూరులో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాం. పేదలకు వైద్య సేవలు అందాలని ఆయన ఎప్పుడూ కోరుకునేవారు. నేను, ప్రసీద, మా బాబు ప్రభాస్ ఆధ్వర్యంలో ఈ ఫ్రీ మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటుచేస్తున్నాం. సుమారు 1000 మంది దాకా ఈ మెడికల్‌ క్యాంప్‌కు వస్తారని అనుకుంటున్నాం’ అని శ్యామలా అంతకు ముందు ఓ వీడియోలో చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos