Ram Charan: చరణ్ కారును వెంబడించిన ఫ్యాన్స్.! హీరో చేసిన పనికి అందరూ షాక్.
మెగా ఫ్యామిలీ మొత్తం ఈసారి సంక్రాంతి వేడుకలను బెంగుళూరులోని ఫాంహౌస్లో గ్రాండ్ గా జరుపుకున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతోపాటు.. అల్లు ఫ్యామిలీ సైతం అక్కడే పండగ జరుపుకుంది. మొత్తం నాలుగు రోజులు కుటుంబమంతా కలిసి సరదాగా ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ నెట్టింట తెగ వైరలయ్యాయి. ఇక ఇటీవలే బెంగుళూరు నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్న చరణ్..ఇప్పుడు తిరిగి గేమ్ ఛేంజర్ సెట్ లో అడుగుపెట్టారు.
మెగా ఫ్యామిలీ మొత్తం ఈసారి సంక్రాంతి వేడుకలను బెంగుళూరులోని ఫాంహౌస్లో గ్రాండ్ గా జరుపుకున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతోపాటు.. అల్లు ఫ్యామిలీ సైతం అక్కడే పండగ జరుపుకుంది. మొత్తం నాలుగు రోజులు కుటుంబమంతా కలిసి సరదాగా ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ నెట్టింట తెగ వైరలయ్యాయి. ఇక ఇటీవలే బెంగుళూరు నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్న చరణ్..ఇప్పుడు తిరిగి గేమ్ ఛేంజర్ సెట్ లో అడుగుపెట్టారు. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో ఉన్న ఇస్నాపూర్, పాశమైలారం ఏరియాల్లో జరుగుతుంది. నాలుగు రోజులుగా అక్కేడ ఈ మూవీ చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడ చరణ్ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలియడంతో అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున చెర్రీని చూసేందుకు తరలివస్తున్నారు. షూట్ ప్లేస్ నుంచి కొన్ని వీడియోస్, ఫోటోస్ నెట్టింట తెగ వైరలయ్యాయి. ఇక ఈక్రమంలోనే రాత్రి షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి బయలుదేరగా కొంతమంది అభిమానులు చరణ్ కారును వెంబడించారు. వాళ్లకు అందకుండా చెర్రీ వేగంగా వెళ్లిపోతాడేమో అనుకున్నారు.
కానీ చరణ్ కారును కాస్త్ స్లో చేసి కారు విండో దించి అభిమానులకు అభివాదం చేసి దయచేసి జాగ్రత్తగా వెళ్లండి అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న గేమ్ ఛేంజర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీలో చరణ్ మొదటి సారి రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. అలాగే ఇందులో మరో రెండు పాత్రలు పోషిస్తున్నాడట. కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుండగా.. త్వరలోనే ఈ చిత్రాన్ని అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు చరణ్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos