AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi Autobiography: మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.! మెగా స్టార్ జీవిత చరిత్ర.. యండమూరి చేతుల్లో.!

Chiranjeevi Autobiography: మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.! మెగా స్టార్ జీవిత చరిత్ర.. యండమూరి చేతుల్లో.!

Anil kumar poka
|

Updated on: Jan 21, 2024 | 4:04 PM

Share

మెగాస్టార్ చిరంజీవి గా పరిచయమైన కొణిదెల శివశంకర వరప్రసాద్ బయోగ్రఫీ నీ ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కు అప్పగించారు చిరంజీవి. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి నే ప్రకటించారు. వైజాగ్ లోని లోకనాయక్ ఫౌండేషన్ నిర్వహించిన ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్నార్ శతజయంతి కార్యక్రమం లో పాల్గొన్న చిరంజీవి యండమూరి సమక్షంలోనే ఈ ప్రకటన చేశారు. లోక్ నాయక్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో యండమూరి తో పాటు పలు రంగాల ప్రముఖులకు అవార్డులు అందించారు ఫౌండేషన్ ప్రతినిధి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు చిరంజీవి.

మెగాస్టార్ చిరంజీవి గా పరిచయమైన కొణిదెల శివశంకర వరప్రసాద్ బయోగ్రఫీ నీ ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కు అప్పగించారు చిరంజీవి. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి నే ప్రకటించారు. వైజాగ్ లోని లోకనాయక్ ఫౌండేషన్ నిర్వహించిన ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్నార్ శతజయంతి కార్యక్రమం లో పాల్గొన్న చిరంజీవి యండమూరి సమక్షంలోనే ఈ ప్రకటన చేశారు. లోక్ నాయక్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో యండమూరి తో పాటు పలు రంగాల ప్రముఖులకు అవార్డులు అందించారు ఫౌండేషన్ ప్రతినిధి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు చిరంజీవి. ఎన్టీఆర్-ఏఎన్నార్ ల గొప్పతనం గురించి ప్రశంసా పూర్వక ప్రసంగం చేసిన చిరంజీవి తన బయోగ్రఫీ గురుంచి కూడా మాట్లాడారు. తన బయోగ్రఫీ రాసుకునే సమయం తనకి లేదని, ఈ నేపథ్యంలో నా బయోగ్రఫీ రాసే సామర్ధ్యం ఒక్క యండమూరి కే ఉందని, అందుకే ఆ బాధ్యత యండమూరి కి అప్పగిస్తున్నానన్నారు చిరు.. సమకాలీన రచయితలలో యండమూరి కి ఎవరూ సాటి లేరు, ఆయన రాసిన అభిలాష సినిమాతోనే పరిశ్రమలో నా స్థానం పదిలం అని అప్పుడే ఫిక్స్ అయ్యానంటూ యండమూరి పై ప్రశంసల వర్షం కురిపించారు చిరు. ఇప్పుడు నా బయోగ్రఫీ రాసే సమయం నాకు లేదు కాబట్టి ఈ బాధ్యతని యండమూరికి అప్పగిస్తున్నా అంటూ అభిమానుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos