100కోట్ల రేంజ్‌ అవుట్ పుట్ దిమ్మతిరిగే కాన్పెప్ట్.. హిట్టా..? ఫట్టా..?

దుల్కర్ సల్మాన్ మనకు హీరోగానే మాత్రమే తెలుసు.. కళ్యాణీ ప్రియదర్శన్ జెస్ట మనకు హలో, చిత్రలహరి హీరోయిన్ గానే తెలుసు. నస్లేన్ జస్ట్ మనకు ప్రేమలు హీరోగా మాత్రమే తెలుసు. అయితే వీరు ముగ్గురు.. కలిసి చేసిన సినిమానే కొత్త లోక ఛాప్టర్ 1 చంద్ర! ఎస్ ! దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూసర్‌గా... కళ్యాణీ ప్రియదర్శి, నస్లెన్ లీడ్‌ రోల్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది.

ఫస్ట్ సూపర్ లేడీగా కళ్యాణీకి ట్యాగ్ వస్తోంది. మరి సినిమా ఎలా ఉంది? అందరూ అనుకుంటున్నట్టే దిమ్మతిరిగి పోయేలా.. పాత్ బ్రేకింగ్‌ లా ఉందా.. లేదా? అనేది తెలియాలంటే వాచ్ దిస్‌ రివ్యూ.. ఇక ఈ సినిమా కథలోకి వెళితే.. చంద్ర అలియాస్ కల్యాణి ప్రియదర్శన్‌కి సూపర్ పవర్స్ ఉంటాయి. ఈ విషయం కొందరికి మాత్రమే తెలుసు. ఓ సందర్భంలో ఆమె బెంగళూరుకు వస్తుంది. తన అతీంద్రయ శక్తుల్ని దాచిపెట్టి, సాధారణ అమ్మాయిలా బతుకుతుంది. కేఫ్‌లో పనిచేస్తుంటుంది. ఈమె ఎదురింట్లో సన్నీ అలియాస్ నస్లేన్ ఫ్రెండ్స్‌తో కలిసి నివసిస్తుంటాడు. చంద్రని చూసి సన్నీ ఇష్టపడతాడు. పరిస్థితులు కలిసొచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఓ రోజు రాత్రి జరిగిన సంఘటనల వల్ల చంద్ర జీవితం తలకిందులవుతుంది. ఇంతకీ చంద్ర ఎవరు? ఆమె గతమేంటి? ఈమెకు ఎస్ఐ నాచియప్ప అలియాస్ శాండీతో గొడవేంటి? చివరకు ఏమైందనేదే అనేదే రిమైనింగ్ స్టోరీ..! ఇప్పుడే కాదు.. ఎప్పటి నుంచో హాలీవుట్ కాన్సెప్ట్‌ ని మన వాళ్లు తస్కరిస్తూనే ఉన్నారు. అలా తస్కరిస్తూనే తమకంటూ యూనివర్స్‌ని క్రియేట్ చేయాలని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ లోకేస్.. టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. బాలీవుడ్ మేకర్స్ యశ్ రాజ్ ఫిల్మ్స్‌ ఎప్పటి నుంచో ఇదే చేస్తున్నారు. ఇప్పుడు వాళ్లలానే మలయాళం నుంచి లోక మేకర్స్ కూడా ఇదే చేసే ప్రయత్నంలో భాగంగా… కొత్త లోక సినిమాను తెరకెక్కించారు. డొమినిక్ అరుణ్ సినిమాటిక్ సూపర్ హీరో వర్స్‌లో ఈ సినిమా ఒక భాగం..ఇందులో చంద్ర ఓ లేడీ సూపర్ పవర్స్ ఉన్న లేడీ..! అందుకు తగ్గట్టే సినిమా కూడా… ఓ పవర్ ఫుల్ ఫైట్ తో మొదలవుతుంది. కొన్ని కారణాల వల్ల చంద్ర బెంగళూరు రావడం, ఇక్కడ ఎదురింట్లో ఉండే సన్నీతో పరిచయం.. ఇలా పాత్రలు, పరిస్థితుల్ని చూపిస్తూ వెళ్లారు. ఓ సాధారణ అమ్మాయిలా బతుకుదాం అని వచ్చిన చంద్ర.. ఒకడిని కొట్టడంతో ఈమె లైఫ్‌లోకి ఓ రౌడీ గ్యాంగ్ వస్తుంది. దీంతో కథలో సంఘర్షణ మొదలవుతుంది. అక్కడి నుంచి చంద్ర లైఫ్ ఎలా టర్న్ అయింది. చివరకు ఏమైందనేదే తెలియాలంటే సినిమా చూడాలి. ఈ సినిమా ఫస్టాప్ అంతా ఎంగేజింగ్‌గా ఉంటుంది. హీరోయిన్‌కి ఉన్న సూపర్ పవర్స్, అందుకు తగ్గట్లు అక్కడక్కడ ఫైట్ సీక్వెన్స్ లు ఎంటర్‌టైన్ చేస్తాయి. సెకండాఫ్ మాత్రం కాస్త బోర్ కొడుతుంది. కానీ చివరకొచ్చేసరికి రెగ్యులర్ చిత్రాలతో పోలిస్తే ఓ డిఫరెంట్ సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. సాధారణంగా ఫిమేల్ సెంట్రిక్ కథలు అనగానే సింపతీనే చూపిస్తుంటారు. ఇందులో అణిచివేతకు ఎదురు నిలబడిన యోధురాలిగా చంద్ర పాత్రని ప్రెజెంట్ చేశారు డైరెక్టర్ డొమినిక్. యక్షిణి పాత్ర గురించి మనం పురాణాల్లో విన్నాం. అయితే ఆ పాత్రని తీసుకుని సూపర్ హీరో తరహా స్టోరీగా మార్చడం.. బ్యాట్ మ్యాన్ టైపులో చూపించడం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సినిమా మొత్తం చూసిన తర్వాత కథని పూర్తి చేయలేదేంటి అనే సందేహం వస్తుంది. కేవలం చంద్ర పాత్ర తాలూకు బలాలు, బలహీనతలు చూపించారు. తర్వాత రాబోయే పార్ట్-2 చిత్రానికి లీడ్ వదిలారు. అయితే అదే కాస్త మనకు డిస్సపాయింట్ గా అనిపిస్తుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే.. కళ్యాణి ప్రియదర్శి.. చంద్ర అనే సూపర్ పవర్స్ ఉన్న క్యారెక్టర్‌లో అదరగొట్టింది. సెటిల్డ్‌గా హావభావాలు పలికిస్తూ.. అందర్నీ ఆకట్టుకుంది. ఫైట్స్ అయితే ఇరగదీసింది. ఇక చంద్ర వెంటపడే అమాయకమైన కుర్రాడిగా నస్లేన్ బాగా నటించాడు. అతడి ఫ్రెండ్స్‌గా చేసిన ఇద్దరు కుర్రాళ్లు కూడా కామెడీ బాగానే చేశారు. ఇక విలన్ నాచియప్ప గా చేసిన శాండీ.. తన యాక్టింగ్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. మిగిలిన వాళ్లు కూడా వాళ్ల పరిధి మేర నటించారు. ఇక వీళ్ల పర్ఫార్మెన్స్‌ పక్కు పెడితే.. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరోలు.. వాళ్లే తెలుగులోనూ పాపులారిటీ సంపాదించుకున్న ఓ ముగ్గురు హీరోలు క్యామియో ఇచ్చారు. వాళ్ల క్యామియో కూడా సినిమాకు హైలెట్. వీళ్లందరికి తోడు.. జేక్స్‌ బిజోయ్‌ ఇచ్చిన సంగీతం అదిరిపోయింది. తెలుగ సినిమాలకు మల్లే కాకుండా.. చాలా ఎఫెక్టివ్‌గా ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చాడు ఈ డైరెక్టర్. ఇక టెక్నికల్ విషయానికి వస్తే.. నిమిష్ రవి సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవల్. రెడ్-బ్లూ కలర్స్‌ని ఉపయోగించిన విధానం బాగుంది. ప్రొడ్యూసర్ గా దుల్కర్ ఈ సినిమాకి 30 కోట్లు ఖర్చు పెట్టినా కూడా… డైరెక్టర్ డొమినక్.. వంద కోట్ల రేంజ్‌లో ఈ సినిమాను తెరకెక్కించాడు. అంతేకాదు డొమినిక్ అరుణ్.. దర్శకుడిగా కంటే రైటర్‌గా ఎక్కువగా ఆకట్టుకున్నాడు.కథలో మైథాలజీ ఉంది. కొత్త పాయింట్ ఉంది. దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు కూడా బాగుంది.అండ్ ఫైనల్‌గా దిస్ ఈజ్ మై రివ్యూ,..!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రేమించిన యువతితో పెళ్లి కోసం సెల్ టవర్ ఎక్కిన యువకుడు.. ఆ తర్వాత

A. R. Rahman: ఇలాంటి మూవీకి పనిచేయడం ప్రతి సంగీత దర్శకుడి కల

LPG Price: గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

ఖాతాదారుల బంగారాన్ని స్వాహా చేసిన బ్యాంక్‌ మేనేజర్‌,క్యాషియర్‌

బయటి నుంచి వచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకున్న వ్యక్తి.. కాసేపటికే నురగలు కక్కుతూ