రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో లేడీ ప్రొఫెసర్‌కు వేధింపులు
విద్యను భోదించే గురువులు.. దేవుళ్లతో సమానమంటారు. కానీ ఈ మాటను మరిచి.. తనకు విద్యను నేర్పించే లేడీ ప్రొఫెసర్‌ను వేధించాడు ఓ ప్రబుద్ధుడు. వెకిలి మాటలతో.. ఇన్‌స్టాలో వెర్రి వేషాలతో ఆమెను ఇబ్బంది పెట్టాడు. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యే వరకు తెచ్చుకున్నాడు. రామానాయుడు ఫిల్మ్ స్కూల్ పేరును నెట్టింట హాట్ టాపిక్ అయ్యేలా చేశాడు.
ఇక అసలు విషయం ఏంటంటే.. భరత్ రెడ్డి అనే వ్యక్తి… రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో.. డైరెక్షన్ కోర్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇతడు తనకు ప్రొఫెసర్‌గా పని చేసే ఓ లేడీని వేధింపులకు గురిచేశాడు. అయితే భరత్ రెడ్డి వేధింపులకు తాళలేక ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసిన ఆమె.. భరత్ రెడ్డిని ఫిల్మ్ స్కూల్ నుంచి తొలగించింది. లేడీ ప్రొఫెసర్ చేసిన పనిని మనసులో పెట్టుకున్న భరత్ రెడ్డి.. ఆమెను సోషల్ మీడియాలో టార్గెట్ చేశాడు. మరింతగా వేధించాడు. అతని వేధింపులు తాళలేక.. ఆ ప్రొఫెసర్ ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఫిల్మ్ నగర్ పోలీసులు భరత్ రెడ్డి పై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
100కోట్ల రేంజ్ అవుట్ పుట్ దిమ్మతిరిగే కాన్పెప్ట్.. హిట్టా..? ఫట్టా..?
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

