సినిమా చేస్తే సరిపోతుందా? ప్రమోషన్స్‌కి డుమ్మా కొడితే ఎలా? అనుష్క తీరుపై విమర్శలు
ఏ రంగంలోనైనా.. కష్టపడితే సరిపోతుంది. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రం కష్టపడితే సరిపోదు.. కష్టపడి తెరకెక్కించిన మన కంటెంట్‌ను ప్రమోట్ చేసుకుంటేనే ఫలితం ఉంటుంది. అందుకే మన స్టార్ హీరోలందరూ తమ సినిమా రిలీజ్‌కు ముందు తెగ కష్టపడుతుంటారు. తమ సినిమా ప్రమోట్ చేసుకునేందుకు నానా పాట్లు పడుతుంటారు.
కానీ అనుష్క మాత్రం ఇందుకు భిన్నంగా రిలాక్స్ అవుతున్నారనే టాక్ వస్తోంది ఇప్పుడు నెట్టింట. అనుష్క లీడ్ రోల్లో.. విక్రమ్ ప్రభు సపోర్ట్ కో లీడ్‌గా… క్రిష్ డైరెక్షన్లో ఘాటీ సినిమా తెరకెక్కింది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈసినిమా ఎన్నో రిలీజ్ డేట్స్ తర్వాత.. ఎట్టకేలకు సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతోంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో ఎక్కడా అనుష్క కనిపించకపోవడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. అనుష్క షూటీ సినిమా కోసం గత కొన్ని రోజులుగా ఈ మూవీ టీం ఇంటర్వ్యూలిస్తోంది. ప్రొడ్యూసర్, డైరక్టర్ క్రిష్, ఈమూవీలో వన్ ఆఫ్ ది లీడ్ చేసిన విక్రమ్ ప్రభు కూడా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తమ ఘాటీ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు. కానీ అనుష్క మాత్రం ఇంటికే పరిమితం అయింది. దీంతో ఈమె తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే రానా తో అనుష్క ఓ ఆడియో కాల్ రిలీజ్ అయింది. కానీ అనుష్క నేరుగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొనకపోవడం ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. ఓ సినిమాలో యాక్ట్ చేశాక.. ప్రమోట్ చేయకపోతే ఎలా.. అంత బద్దకమైతే ఎలా అయితే ఎలా అనే కామెంట్ ఆమె ఫ్యాన్స్ నుంచే వస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో లేడీ ప్రొఫెసర్‌కు వేధింపులు
100కోట్ల రేంజ్ అవుట్ పుట్ దిమ్మతిరిగే కాన్పెప్ట్.. హిట్టా..? ఫట్టా..?
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

