NTR-Devara: దేవర తొలి రోజు కలెక్షన్స్‌లో.. సగం NTR రెమ్యునరేషనే.!

NTR-Devara: దేవర తొలి రోజు కలెక్షన్స్‌లో.. సగం NTR రెమ్యునరేషనే.!

Anil kumar poka

|

Updated on: Sep 29, 2024 | 1:11 PM

మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. డే1 వరల్డ్ వైడ్ 140 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు రిపోర్ట్ కూడా బయటికి వచ్చింది. మరి అలాంటి ఈ సినిమాలో తారక్ అండ్ సైఫ్ అలీఖాన్ రెమ్యునరేషన్‌గా ఎంత తీసుకున్నారని మీరనుకుంటున్నారు?

మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. డే1 వరల్డ్ వైడ్ 140 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు రిపోర్ట్ కూడా బయటికి వచ్చింది. మరి అలాంటి ఈ సినిమాలో తారక్ అండ్ సైఫ్ అలీఖాన్ రెమ్యునరేషన్‌గా ఎంత తీసుకున్నారని మీరనుకుంటున్నారు? అది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి. కొరటాల శివ డైరెక్షన్లో దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు గాను.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాదాపు 60 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్‌గా తీసుకున్నారట. ఇక ఈ సినిమాలో విలన్‌గా యాక్ట్ చేసిన సైఫ్ అలీ ఖాన్ దాదాపు 10 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్‌గా అందుకున్నాడట. ఇక ఎన్టీఆర్ కు జోడీగా యాక్ట్ చేసిన తంగం అలియాస్ జాన్వీ కపూర్ ఈ సినిమా కోసం ఏకంగా 5 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్‌గా అందుకున్నారట.

అయితే దేవర రిలీజ్ అయిన మొదటి రోజే 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన వేళ.. వీరిద్దరి రెమ్యునరేషన్‌ మరోసారి నెట్టింట బయటికి వచ్చింది. అది కాస్తా వైరల్ అవుతోంది. దాంతో పాటే డే1 కలెక్షన్స్లో సింహభాగం వీరిద్దరి రెమ్యునరేషనేగా అనే కామెంట్ వస్తోంది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఎన్టీఆర్, సైఫ్ రెమ్యునరేషన్ గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. ఈ సినిమా బడ్జెట్ లో దాదాపు 26 శాతం ప్రధాన తారాగణం కోసమే చెల్లించారనే టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, సైఫ్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ , శ్రీకాంత్ కీలకపాత్రలు పోషించారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తారక్ రూ.45 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. కానీ ఇప్పుడు దేవర కోసం రూ.60 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.