ప్రియుడిని పరిచయం చేసిన జబర్దస్త్‌ లేడీ కమెడియన్

బుల్లితెర అయినా.. వెండితెర అయినా సినిమా ఇండస్ట్రీలో మగ వారిదే ఆధిపత్యం. ఇక కమెడియన్లలో అయితే వారిదే ఏక చక్రాధిపత్యం. అయితే అప్పుడప్పుడు కొందరు లేడీ కమెడియన్స్ కూడా సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో బుల్లితెర కమెడియన్ జబర్దస్త్ ఫేమ్ ఫైమా ఒకరు. ప‌టాస్ షోతో బుల్లితెరకు పరిచయమైన ఈ కామెడీ క్వీన్ జబర్దస్త్ షో తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనదైన కామెడీ పంచులు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది.

ప్రియుడిని పరిచయం చేసిన జబర్దస్త్‌ లేడీ కమెడియన్

|

Updated on: May 21, 2024 | 9:24 PM

బుల్లితెర అయినా.. వెండితెర అయినా సినిమా ఇండస్ట్రీలో మగ వారిదే ఆధిపత్యం. ఇక కమెడియన్లలో అయితే వారిదే ఏక చక్రాధిపత్యం. అయితే అప్పుడప్పుడు కొందరు లేడీ కమెడియన్స్ కూడా సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో బుల్లితెర కమెడియన్ జబర్దస్త్ ఫేమ్ ఫైమా ఒకరు. ప‌టాస్ షోతో బుల్లితెరకు పరిచయమైన ఈ కామెడీ క్వీన్ జబర్దస్త్ షో తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనదైన కామెడీ పంచులు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది. ముఖ్యంగా ప్రవీణతో కలిసి ఫైమా చేసిన స్కిట్స్ కామెడీ ప్రియులను కడుపుబ్బా నవ్వించాయి. అయితే ఆన్ స్క్రీన్‌లో జంటగా కనిపించే ఫైమా, ప్రవీణ్ రియల్ లైఫ్‌ లోనూ లవ్ లో ఉన్నారని ప్రచారం జరిగింది. ఇద్దరూ కలిసి ఇన్ స్టాలో రీల్స్ చేయడం, పోస్ట్ లు షేర్ చేసుకోవడం, గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకోవడం ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. అయితే ఉన్నట్లుండి ఈ జోడీ బ్రేకప్ చెప్పుకుంది. ఫైమా తన ప్రేమను తిరస్కరించిందని ప్రవీణ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఫైమా కూడా దీనిపై స్పందిస్తూ ప్రవీణ్‌తో విడిపోయానంటూ క్లారిటీ ఇచ్చింది. ఇంతలోనే తన ఫ్యాన్స్‌ కు పెద్ద షాకింగ్‌ న్యూస్ చెప్పింది ఫైమా. సోషల్ మీడియా వేదికగా తన బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. తాజాగా ఫైమా తన బాయ్‌ఫ్రెండ్‌తో బర్త్ డేను సెలబ్రేట్‌ చేసుకుంది. ఇదే సందర్భంగా తన లవర్ ప్రవీణ్‌ నాయక్‌ అని ఇంట్రడ్యూస్ చేసింది. ఫైమాతో కలిసున్న ఫొటోలను ప్రవీన్‌ నాయక్‌ కూడా సోషల్ మీడియా షేర్‌ చేశాడు. . ‘నా ప్రియిమైన లవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మా ప్రేమ మొదలయ్యి 5 సంవత్సరాలైంది. ఇన్నిరోజులు ఎలా గడిచిపోయాయో అసలు తెలీదు. నా జీవితం మొత్తం నీతోనే గడపాలని ఉంది. నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తునే ఉంటాను’ అని ఫైమాపై ప్రేమను ఒలక బోశాడు ప్రవీణ్. దీనికి ఫైమా కూడా స్పందించి ఆ ఫొటోలను షేర్ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jr NTR: దటీజ్ తారక్‌ క్రేజ్‌.. NTRను చూడ్డానికి 10 లక్షల మంది తరలివచ్చారు..

భారీ ఉల్కాపాతం.. అర్ధరాత్రి ని పట్టపగలు లా మార్చిన కాంతి..

కొంపముంచిన రీల్స్‌ పిచ్చి.. ముగ్గురు మృతి..

టేకాఫ్‌ అయిన విమానంలో మంటలు.. దానిలో ఉన్న 179 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ??

కరోనా ఉపద్రవం మళ్లీ స్టార్ట్ !! వారంలో రోజుల్లో గణనీయంగాపెరిగిన కేసుల సంఖ్య

Follow us