Anjali - Balakrishna: బాలయ్యను ట్రోల్ చేస్తున్న వారికి ఇన్‌డైరెక్ట్‌గా ఇచ్చిపడేసిన అంజలి.

Anjali – Balakrishna: బాలయ్యను ట్రోల్ చేస్తున్న వారికి ఇన్‌డైరెక్ట్‌గా ఇచ్చిపడేసిన అంజలి.

Anil kumar poka

|

Updated on: Jun 01, 2024 | 7:27 PM

గత రెండు రోజులుగా నందమూరి బాలకృష్ణ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. బాలయ్యపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించిన లేటేస్ట్ చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా మే 31న గ్రాండ్ గా విడుదలైంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వెళ్లారు బాలకృష్ణ.

గత రెండు రోజులుగా నందమూరి బాలకృష్ణ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. బాలయ్యపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించిన లేటేస్ట్ చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా మే 31న గ్రాండ్ గా విడుదలైంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వెళ్లారు బాలకృష్ణ. ఈ వేడుకలో తనదైన స్పీచ్ తో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్స్ నేహా శెట్టి, అంజలితో స్టేజ్ పై మాట్లాడుతూ.. అంజలిని పక్కకు తోసేశారు. ఇందుకు సంబంధించిన క్లిప్ షేర్ చేస్తూ బాలయ్య పై సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే ఈ వివాదంపై హీరో విశ్వక్ సేన్, నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఇదే విషయంపై హీరోయిన్ అంజలి రియాక్ట్ అయ్యారు. నేరుగా బాలయ్య వివాదంపై రియాక్ట్ కాకుండా పరొక్షంగా ట్రోల్స్‏కు చెక్ పెట్టారు అంజలి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చినందుకు బాలకృష్ణ గారికి ధన్యవాదాలు అని తన ట్వీట్లో రాసుకొచ్చిన అంజలి.. తనకు బాలకృష్ణ గారికి ఒకరిపట్ల ఒకరికి పరస్పర గౌరవం ఉందని.. తాము చాలా కాలంగా మంచి స్నేహితులమని..తన ట్వీట్లో కోట్ చేశారు. అంతేకాదు ఆయనతో మళ్లీ వేదిక పంచుకోవడం అద్భుతంగా అనిపించిందన్నారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వివాదాస్పదమవుతున్న క్లిప్ కూడా వీడియోలో షేర్ చేస్తూ.. ట్రోల్స్‏కు చెక్ పెట్టేసింది అంజలి. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ స్పందిస్తున్నారు.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.