15 నిమిషాలు కనిపించినందుకు రూ.4 కోట్ల రెమ్యునరేషన్ .. హీరో దశ తిప్పిన యానిమల్
బాబీ డియోల్ తండ్రి ఒకప్పుడు స్టార్ హీరో. తన అన్నయ్య కూడా స్టార్ స్టేటస్ ఉన్న హీరో. కానీ ఆ రేంజ్ క్రేజ్ మాత్రం బాబీకి రాలేదు. హీరోగా పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆ తర్వాత మెల్లమెల్లగా ఫేడవుట్ అయిపోయాడు. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా గడిపిన ఈ హీరో.. ఆ తర్వాత మాత్రం సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాడు.
ఈ క్రమంలోనే 55 ఏళ్ల వయసులో తన కెరీర్‌ను మలుపు తిప్పింది యానిమల్ మూవీ. అందులో కనిపించింది కేవలం 15 నిమిషాలే.. అయినప్పటికీ స్టార్ హీరో రేంజ్ పాలోయింగ్ సంపాదించుకున్నాడు బాబీ డియోల్. అంతేకాదు ఆ సినిమాలో తను చేసిన పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ తో ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు బాబీ. ఇక యానిమల్ సినిమాలో కేవలం 15 నిమిషాలు మాత్రేమే కనిపిస్తాడు బాబీ. కానీ బాబీ పాత్ర ఐకానిక్‌గా మారింది. దాంతో పాటే 4 కోట్ల భారీ రెమ్యునరేషన్ కూడా దక్కింది. ఎస్ ! ఈ సినిమాలోని 15 నిమిషాల క్యారెక్టర్ చేసినందుకు గాను.. బాబీకి సందీప్ రెడ్డి వంగా.. దాదాపు 4 కోట్లను రెమ్యునరేషన్‌గా ఇచ్చారట. ఇక యానిమల్ సినిమా హిట్‌తో.. ఆ తర్వాత బాబీకి ఆఫర్స్ క్యూ కట్టాయి. అలాగే అటు వెబ్ సిరీస్ ఆఫర్లు కూడా వరుసగా వస్తున్నాయి. ఇటీవలే కంగువ చిత్రంలోనూ కనిపించారు. ఇక ఓ రిపోర్ట్ ప్రకారం.. బాబీ డియోల్ ఆస్తుల విలువ రూ.100 కోట్లు ఉంటుందని అంచనా.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రామ్ పోతినేని ఎఫెక్ట్ దెబ్బకు శ్రీసత్య.. నెట్టింట్ ట్రెండ్ అంతే
డైరెక్టర్‌గా మారిన మ్యూజిక్ డైరెక్టర్.. ఆహాలో స్ట్రీమింగ్ షురూ..
12 ఏళ్ల తర్వాత రిలీజ్.. మరి హిట్టా..? ఫట్టా..?