హీరోను ఎగిరితన్నిన ఆగంతకుడు.. బిత్తరపోయిన స్టార్
లుక్ ముఖ్యం కాదు నటనే ముఖ్యం అని నిరూపించాడు స్టార్ హీరో విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్‌తోపాటు తెలుగు, హిందీలోనూ అభిమానులను సొంతం చేసుకున్నాడు విజయ్. సినిమా రంగంలోకి రాకముందు విజయ్ చాలా కష్టమైన జీవితం గడిపాడు. ఇప్పుడు స్టార్ గా ఎదిగిన తర్వాత కూడా ఆయన సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారు.
విజయ్ సేతుపతి తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. సహజమైన నటనతో మక్కల్ సెల్వన్ గా పేరు తెచ్చుకున్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్ గా చేస్తూ రాణిస్తున్నాడు. ఇక ఈ విషయం కాసేపు పక్కకు పెడితే.. తాజగా విజయ్ సేతుపతికి సంబందించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి విజయ్ సేతుపతిని తన్నినట్టుగా కనిపించడం అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. ఇక ఆ వీడియోలోకి వెళితే.. విజయ్ సేతుపతి ఎయిర్ పోర్ట్ లో తన ఫ్రెండ్స్‌తో తనపాటికి తాను నడుచుకుంటూ వెళుతుండగా… వెనక నుంచి ఓ అగంతకుడు వేగంగా వచ్చి విజయ్‌ను ఎగిరి మరీ కాలితో తంతాడు. దాంతో ముందుకు తూలిన విజయ్ సేతుపతి.. ఆ తరువాత కాస్త సర్దుకుని ఆ వ్యక్తి వైపు సీరియస్ గా అడుగులు వేస్తాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
15 నిమిషాలు కనిపించినందుకు రూ.4 కోట్ల రెమ్యునరేషన్ .. హీరో దశ తిప్పిన యానిమల్
రామ్ పోతినేని ఎఫెక్ట్ దెబ్బకు శ్రీసత్య.. నెట్టింట్ ట్రెండ్ అంతే
డైరెక్టర్‌గా మారిన మ్యూజిక్ డైరెక్టర్.. ఆహాలో స్ట్రీమింగ్ షురూ..

పాపం.. వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్..

అది.. వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ కారు కాదమ్మా

కానుకలు నచ్చలేదన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

ఇదేం పిల్లి మావా.. ఏకంగా విమానాన్నే ఆపేసింది..

భర్తకు భార్య ఇచ్చిన వెరైటీ వాలంటైన్ డే గిఫ్ట్..

పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా?

అయ్యబాబోయ్.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది
