12 ఏళ్ల తర్వాత రిలీజ్.. మరి హిట్టా..? ఫట్టా..?
జమానా మారింది. రీజనల్ సినిమా కాస్తా పాన్ ఇండియా సినిమాగా టర్న్ తీసుకుంది. కమర్షియల్ యాక్షన్ సినిమా కాస్తా.. లార్జర్ దేన్ బొమ్మగా ట్రాన్స్‌ఫాం అయింది. ఆడియెన్స్ టేస్ట్ మారిపోయింది. అందుకనుగుణంగా డైరెక్టర్ థింకింగ్ మారిపోయింది. సీన్ కంపోజిషన్, న్యూ ఏజ్ మేకింగ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు తెరపైకొచ్చింది.
కామన్ కథను కొత్తగా చెప్పే ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది. ఇలాంటి ఈ పరిస్థితుల్లో 12 ఏళ్ల కిందటి పాత సినిమా ఒకటి రిలీజ్ అయింది. అదే మదగజరాజా! సుందర్ సి డైరెక్షన్లో విశాల్ హీరోగా.. అంజలి, ఐశ్వర్య హీరోయిన్లుగా చేసిన ఈసినిమా ఈ సంక్రాంతి కానుకగా కోలీవుడ్‌లో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. తమిళ తంబీలను బానే ఎంటర్‌టైన్ చేసింది. అలాంటి ఈ సినిమా తాజాగా తెలుగులోనూ రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం..! ముందు ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. మదగజరాజా షార్ట్‌లో రాజా అలియాస్ విశాల్ అరకులో ఓ కేబుల్ ఆపరేటర్. తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తుంటాడు. అప్పుడప్పుడూ తండ్రి చేయాల్సిన పనులమి కూడా తానే రంగంలోకి దిగి చక్కబెడుతుంటాడు రాజా. ఆ క్రమంలోనే మాధవి అలియాస్ అంజలిని చూసి మనసు పారేసుకుంటాడు. అలా అనుకోకుండా… తన కూతురు పెళ్లికి రావాలంటూ చిన్నప్పుడు పాఠాలు చెప్పిన మాస్టార్ నుంచి రాజాకు, అతని గ్యాంగ్‌కు ఫోన్ రావడంతో.. ఆ పెళ్లిలో అందరూ కలుసుకుంటారు. అయితే పెళ్లిలో ఆనందంగా గడపాల్సిన మాస్టారుకి ఊహించని విధంగా ఓ పెద్ద సమస్య ఎదురవుతుంది. వెంటనే రాజా, అతని స్నేహితులంతా కలిసి ఆ సమస్యని చక్కదిద్దుతారు. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయే క్రమంలో తన చిన్న నాటి స్నేహితులకు రకరకాల సమస్యలు ఉన్నాయని.. దానికి కారణం కాకర్ల విశ్వనాథ్ అలియాస్ సోనూసూద్ అని తెలుసుకుంటాడు రాజా.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pooja Hegde: లవ్ ఎఫైర్ గురించి పూజాహెగ్డే క్లారిటీ
Saif Ali Khan: సైఫ్‌పై కోర్టుకెక్కుతా.. అంతా కోల్పోయా
నాలుగేళ్లు సక్సెస్ లేదు.. ఆ ఒక్క సినిమాతో స్టారయ్యాడు..
ఒక్క ఎపిసోడ్ కోసమే రూ.18 కోట్లు.. ఖర్చులో ఏమాత్రం తగ్గని డైరెక్టర్!