Trisha: త్రిషపై నటుడి వెకిలి వ్యాఖ్యలు.. లియో డైరెక్టర్ లోకేష్‌ కనగరాజ్‌ సీరియస్.!

Trisha: త్రిషపై నటుడి వెకిలి వ్యాఖ్యలు.. లియో డైరెక్టర్ లోకేష్‌ కనగరాజ్‌ సీరియస్.!

Anil kumar poka

|

Updated on: Nov 20, 2023 | 7:53 AM

హీరోయిన్ త్రిష గురించి కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట దుమారాన్ని రేపుతున్నాయి. త్రిష, విజయ్ కలిసి నటించిన లియో సినిమాలో తాను నటిస్తున్నాని తెలిసిందని.. దీంతో ఈ మూవీలో ఒక్క బెడ్ రూమ్ సీన్ కూడా లేకపోవడం నిరాశకలిగించిందని వ్యాఖ్యానించారు. కాశ్మీర్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు త్రిషతో రేప్ సీన్ ఉంటుందని అనుకుంటే.. సెట్ లో త్రిషను కనీసం తనకు చూపించలేదంటూ కామెంట్స్ చేశాడు.

హీరోయిన్ త్రిష గురించి కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట దుమారాన్ని రేపుతున్నాయి. త్రిష, విజయ్ కలిసి నటించిన లియో సినిమాలో తాను నటిస్తున్నాని తెలిసిందని.. దీంతో ఈ మూవీలో ఒక్క బెడ్ రూమ్ సీన్ కూడా లేకపోవడం నిరాశకలిగించిందని వ్యాఖ్యానించారు. కాశ్మీర్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు త్రిషతో రేప్ సీన్ ఉంటుందని అనుకుంటే.. సెట్ లో త్రిషను కనీసం తనకు చూపించలేదంటూ కామెంట్స్ చేశాడు. ఇప్పటికే అతడి వ్యాఖ్యలపై త్రిష అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి నటుడితో తాను ఇంకెప్పటికి నటించనని ట్వీట్‌ చేశారు. మరోవైపు మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలపై కోలీవుడ్ స్టార్స్ మండిపడుతున్నారు. ఇప్పటికే సింగర్ చిన్మయి శ్రీపాద, హీరోయిన్ మాళవిక మోహనన్ స్పందిస్తూ.. మహిళల గురించి ఇలా మాట్లాడడం చాలా అసహ్యంగా అనిపిస్తోందంటూ మండిపడ్డారు. మరోవైపు, మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలపై లియో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ స్పందించారు. మన్సూర్ అలీఖాన్ చేసిన స్త్రీ దేషపూరిత వ్యాఖ్యలు విని ఆగ్రహానికి గురయ్యాము. మేమంతా కలిసి లియో సినిమా కోసం ఒకే జట్టుగా పనిచేశాము. మహిళలు, తోటి కళాకారులు, నిపుణుల పట్ల గౌరవం అనేది ఏ పరిశ్రమలోనైనా ఇచ్చిపుచ్చుకునేలా ఉండాలి. అతడి మాటలను పూర్తిగా ఖండిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన లియో చిత్రంలో విజయ్ దళపతి, త్రిష జంటగా నటించారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటించగా.. మన్సూర్ అలీఖాన్ కీలకపాత్రలో కనిపించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.