ఇండస్ట్రీలో మరో విషాదం.. స్టార్ డైరెక్టర్ కన్నుమూత
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ గాధ్వి కన్నుమూశారు. నవంబరు 19 ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు గాధ్వి ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారని కుమార్తె సంజీనా వెల్లడించారు. అయితే ఆయనకు అనారోగ్యం ఏమీ లేదని, బహుశా గుండెపోటుకు గురై ఉంటారని భావిస్తున్నామని తెలిపారు. ఇటీవల కాలంలో ఆయనకు ఆరోగ్య సమస్యలేవీ లేవని ఆమె వెల్లడించారు. కాగా, సంజయ్ గాధ్వి మరో మూడు రోజుల్లో పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉండగా, అంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ గాధ్వి కన్నుమూశారు. నవంబరు 19 ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు గాధ్వి ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారని కుమార్తె సంజీనా వెల్లడించారు. అయితే ఆయనకు అనారోగ్యం ఏమీ లేదని, బహుశా గుండెపోటుకు గురై ఉంటారని భావిస్తున్నామని తెలిపారు. ఇటీవల కాలంలో ఆయనకు ఆరోగ్య సమస్యలేవీ లేవని ఆమె వెల్లడించారు. కాగా, సంజయ్ గాధ్వి మరో మూడు రోజుల్లో పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉండగా, అంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. ఆయన మృతితో బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. సంతాపం ప్రకటిస్తూ పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలు ధూమ్, ధూమ్-2 చిత్రాలకు గాధ్వినే దర్శకుడు. గాధ్వి వయసు 56 సంవత్సరాలు. ఆయన 2000 సంవత్సరంలో తేరే లియే చిత్రంతో కెరీర్ ప్రారంభించారు. 2002లో మేరే యార్ కి షాదీ హై చిత్రంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. కెరీర్ లో చివరిగా ఆపరేషన్ పరిందే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2020లో వచ్చింది. ఆ తర్వాత ఆయన మెగాఫోన్ పట్టలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అసలే కోతి.. పైగా పులితో పెట్టుకుంది.. చివరికి ??
Israel – Hamas: కాల్పుల విరమణకు హమాస్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందం ??
NTR Memorial Coin: రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ స్మారక నాణెం అమ్మకాలు..
మిస్ యూనివర్స్ 2023 గా నికరాగ్వా భామ..షేనిస్
అందర్ని ఆకర్షించేలా బియ్యపుగింజపై వరల్డ్ కప్, జాతీయ జెండా