స్టార్ కమెడియన్‌కు యాక్సిడెంట్! క్లారిటీ.. వీడియో
సెలబ్రిటీల మీద.. స్టార్ నటుల మీద.. నెట్టింట రూమర్స్ రావడం.. వాటి మీద వాళ్లు రంగంలోకి దిగి క్లారిటీ ఇవ్వడం కామన్. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు విషయంలో కూడా ఇదే జరిగింది. యోగిబాబుకు యాక్సిడెంట్ అయిందని.. ఓ న్యూస్ ఉన్నట్టుడి కోలీవుడ్ మీడియాలో వైరల్ అయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలంటూ కొన్ని ఫోటోలు కూడా నెట్టింట కనిపించాయి. దీంతో రంగంలోకి దిగిన ఈ స్టార్ నటుడు.. తనకు యాక్సిడెంట్ జరిగిందంటూ వైరల్ అవుతున్న వార్తలపై రియాక్టయ్యాడు. క్లారిటీ ఇచ్చాడు.
తనకు ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదని.. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదంటూ.. తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టాడు యోగిబాబు. అంతేకాదు తాను క్షేమంగా ఉన్నానని.. తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజాలు లేవని రాసుకొచ్చాడు. దీంతో అభిమానులు, సినీప్రముఖులు ఊపిరి పీల్చుకున్నారు. యోగిబాబు చేసిన ట్వీట్ ను వైరల్ చేస్తున్నారు. దాంతో పాటే ఇలాంటి రూమర్స్‌ను వైరల్ చేస్తున్న వారిపై సైబల్ సెల్ టీం యాక్షన్ తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు నెటిజన్స్.
మరిన్ని వీడియోల కోసం :
ఆ టైంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నా..స్టార్ నటి షాకింగ్ కామెంట్స్ వీడియో
బస్సులో మొబైల్‌లో మునిగిపోయిన ప్రయాణికులు.. అలికిడి విని పైకి చూడగానే షాక్!
అల్యూమినియం పాత్రల్లో వంట చేస్తున్నారా.? తస్మాత్ జాగ్రత్త!
గుండెపోటు బాధితుడికి సీపీఆర్.. కళ్లు తెరిచాక ఆ వ్యక్తి అన్న మాటలకు అంతా షాక్
వైరల్ వీడియోలు