Deepika Padukone: దీపిక బికినీ రంగుపై బీజేపీ నేతల ఆగ్రహం !!
సినిమాల్లో గ్లామర్ డోస్ పెరుగుతోందా..? హీరోయిన్లు మరీ గ్లామర్ షో చేస్తున్నారా? దీన్నే ఫ్యాషన్గా కోట్ చేస్తూ.. యంగ్ ఇండియన్స్‌ను మారేలా చేస్తున్నారా? మొత్తంగా ఇండియన్ కల్చర్‌కే మచ్చ తెస్తున్నారా..?
సినిమాల్లో గ్లామర్ డోస్ పెరుగుతోందా..? హీరోయిన్లు మరీ గ్లామర్ షో చేస్తున్నారా? దీన్నే ఫ్యాషన్గా కోట్ చేస్తూ.. యంగ్ ఇండియన్స్‌ను మారేలా చేస్తున్నారా? మొత్తంగా ఇండియన్ కల్చర్‌కే మచ్చ తెస్తున్నారా..? అంటే అవుననే అంటున్నారు బీజేపీ నేతలు. అనడమే కాదు.. సినిమాల్లో కాస్త అభ్యంతరకరంగా ఏది అనిపించినా.. కనిపించినా.. బాహాటంగానే విమర్శిస్తున్నారు. అవసరమైతే సినిమాను అడ్డుకుంటామంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్… పఠాన్ విషయంలోనూ ఇదే చేశారు. ఎస్ ! షారుఖ్ మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా తెరకెక్కిన ‘పఠాన్’ సినిమా నుంచి తాజాగా రిలీజైన ‘బేషరమ్ రంగ్’ సాంగ్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఇక ఈ సాంగ్‌లో దీపిక బికినీ పై…. ఆ బికినీ రంగులపై కూడా వాళ్లు అబ్జెక్షన్ చేస్తున్నారు. పాట.. బేషరమ్ రంగ్ అనే లిరిక్ తో మొదలవ్వడం.. భారతీయ కల్చర్‌లో ముఖ్యమైన కాషాయ రంగును.. ఆకుపచ్చ రంగును దీపిక వేసుకున్న బికినీ రంగుగా చూపించడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: